వీడియో: టైగర్ నాగేశ్వరరావు మేకింగ్ గగుర్పాటే
రవితేజ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం మూడు భారీ సెట్లలో జరిగింది. 365 రోజుల పాటు చిత్రబృందం చేసిన సమిష్టి కృషి ఫలించి ఇంత మంచి విజువల్స్ సాధ్యమయ్యాయని అంగీకరించాలి.
By: Tupaki Desk | 16 Oct 2023 2:10 PM GMTకొన్ని వీడియోలు చూసినప్పుడే సినిమాపై ఇంప్రెషన్ పడిపోతుంది. ఇదిగో ఇది ఆ కేటగిరీనే. అది అలాంటి మేకింగ్ వీడియోనే. టైగర్ నాగేశ్వరరావు కోసం దర్శకుడు వంశీ ఎంతగా ఎఫర్ట్ పెట్టి పని చేసారో ఈ విజువల్ చెబుతోంది. దర్శకుడు వంశీ ఐదేళ్ల కల అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎట్టకేలకు మరో నాలుగు రోజుల్లో రిజల్ట్ దశకే చేరనుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకింగ్ వీడియోలో టైగర్ నాగేశ్వరరావు కష్ఠం .. ఇతర ఆర్టిస్టులతో సన్నివేశాల్ని పండించడానికి పడిన పాట్లు చూస్తుంటే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
రవితేజ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం మూడు భారీ సెట్లలో జరిగింది. 365 రోజుల పాటు చిత్రబృందం చేసిన సమిష్టి కృషి ఫలించి ఇంత మంచి విజువల్స్ సాధ్యమయ్యాయని అంగీకరించాలి. ఈ సినిమా కంటెంట్ ని లైవ్ లీగా క్రియేట్ చేసేందుకు వంశీ చాలా రిస్కులు తీసుకున్నారని అర్థమవుతోంది.
బీచ్ పరిసరాల్లో షూటింగ్.. అలాగే ఇండోర్ సెట్లో కొలను ఏర్పాటు చేసి దాని చుట్టూ పదుల సంఖ్యలో బోట్లతో సన్నివేశాల్ని మలిచిన విజువల్స్ ని కూడా చూపించారు ఈ మేకింగ్ వీడియోలో. థియేటర్లలో చూడబోతున్న దృశ్యాలు ఏ రేంజులో ఉంటాయో దీనిని బట్టి ఊహించవచ్చు. టైగర్ నాగేశ్వరరావు పాత్రను పోషించడానికి రవితేజ ముఖ్యంగా యాక్షన్ బ్లాక్‌లలో తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడని అంగీకరించాలి. ఇక దొంగల కుటుంబాల్లో కల్లోలాలు ఎలా ఉంటాయో కూడా ఇందులో కనిపిస్తోంది. అనుపమ్ ఖేర్ పాత్రను ఇంటెన్స్ గా చూపిస్తున్నారని విజువల్స్ చెబుతున్నాయి.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆన్ లొకేషన్ ఎంతో పట్టుదలగా రాజీ లేని వాడిగా కనిపిస్తున్నాడు. ట్రైలర్, మేకింగ్ వీడియోలు మంచి కాన్ఫిడెన్స్ ని ఇచ్చాయి. మాస్ మహారాజాని పాన్ ఇండియా స్టార్ ని చేయడం కోసం వంశీ-అభిషేక్ చాలా ఎఫర్ట్ పెట్టి పని చేసారు. ఈ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.