డిజైనర్ లుక్కులో పిచ్చెక్కించిన మలైకా
ఇప్పుడు అందమైన వైట్ అండ్ గోల్డ్ లెహంగాలో మలైకా ఫోజులు కుర్రకారు గుండెల్లో గుబులు పెంచుతున్నాయి.
By: Tupaki Desk | 28 March 2025 5:16 AMబికినీలు స్విమ్ సూట్లు జిమ్ వేర్.. దుస్తులు ఏవైనా అందులో వేడెక్కించడం మలైకా ప్రత్యేకత. చీరకట్టులోను చిల్లింగ్ అందాలతో మతులు చెడగొడుతుంది. ఇప్పుడు అందమైన వైట్ అండ్ గోల్డ్ లెహంగాలో మలైకా ఫోజులు కుర్రకారు గుండెల్లో గుబులు పెంచుతున్నాయి. ఇది సురిలీ గోయెల్ లెహెంగా... మలైకా ఫోటోషూట్ బ్యాక్ గ్రౌండ్ పెయింటింగు ప్రత్యేకంగా హైలైట్ అయింది. 51 ఏళ్ల మలైకా కు సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆస్తా శర్మ ఈ లుక్‌ను స్టైలింగ్ చేసారు.
ఈ ఖరీదైన డిజైనర్ లెహంగా తొమ్మిది అడుగుల పొడవుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చురిదార్ స్లీవ్స్ ఐవరీ బ్లౌజ్‌తో బంగారు రంగు పూల ఎంబ్రాయిడరీ డిజైన్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మలైకా అందాలను ప్లంగింగ్ V-నెక్‌లైన్ అద్భుతంగా ఎలివేట్ చేసింది. ఇది అభిమానులకు ప్రత్యేకమైన కనువిందు.
మలైకా తన లుక్ కు ఎత్నిక్ గోల్డ్ చోకర్ నెక్లెస్, స్టేట్మెంట్ రౌండ్ చెవిపోగులు, తెల్లటి ముత్యాల పూసలను జోడించింది. మత్తు చల్లే కనుల అందాలతో మలైకా మైమరిపించింది. మలైకా అరోరా ఎత్నిక్ చిక్ అవతార్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఏజ్ లెస్ బ్యూటీగా చెలమాణి అవుతున్న మలైకా అర్జున్ కపూర్ నుంచి విడిపోయాక పూర్తిగా ఒంటరి. ప్రస్తుతం కెరీర్ పై మాత్రమే దృష్టి సారించింది. రియాలిటీ షోలు ఫ్యాషన్ షోలతో భారీగా ఆర్జిస్తోంది. సోషల్ మీడియా ప్రకటనలు, పోస్టింగులతోను లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది.