Begin typing your search above and press return to search.

51 వ‌యసులో మ‌లైకా ఫిట్నెస్ ర‌హ‌స్యాలు

51 వ‌య‌సులో మలైకా అరోరా ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్‌తో ఆక‌ర్షిస్తోంది. దీనికోసం ఈ వ‌యసులోను జిమ్‌లో క్ర‌మం త‌ప్ప‌క క‌స‌ర‌త్తులు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Dec 2024 12:30 AM GMT
51 వ‌యసులో మ‌లైకా ఫిట్నెస్ ర‌హ‌స్యాలు
X

51 వ‌య‌సులో మలైకా అరోరా ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్‌తో ఆక‌ర్షిస్తోంది. దీనికోసం ఈ వ‌యసులోను జిమ్‌లో క్ర‌మం త‌ప్ప‌క క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. రెగ్యుల‌ర్‌గా యోగా, జిమ్ సెష‌న్స్, మెడిటేష‌న్ తో ఫిట్ లుక్ సాధ్యమ‌ని మ‌లైకా నిరూపిస్తోంది. వీట‌న్నిటితో పాటు అడపాదడపా ఉపవాసంతో ఫిట్‌గా ఫ్యాబ్‌గా ఉండ‌టం సాధ్యం. ఉదయం మంచి నీళ్లు తాగడంతో రోజు మొద‌ల‌వుతుంది. రోజంతా ద్ర‌వాహారాల‌ను సేవించ‌డం ద్వారా ఉప‌వాస ధీక్ష‌ను చేప‌డ‌తాన‌ని కూడా ఇటీవ‌ల మ‌లైకా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

అడపాదడపా ఉపవాస నియమం:

ఈ సంవత్సరం అంద‌రి దృష్టిని ఆకర్షించిన అత్యంత ప్రజాదరణ పొందిన ఫిట్‌నెస్ ట్రెండ్‌లలో అడపాదడపా ఉపవాసం ఒకటి. ఇది నిర్దిష్ట సమయానికి మాత్రమే భోజనం చేసే ఆహార దినచర్య. మలైకా అరోరా తన చివరి భోజనం రాత్రి 7-7:30 గంటలకు తీసుకుంటుంది. కాబట్టి 16-18 గంటల పాటు ఉపవాసం ఉంటుంది. అంటే ఉదయం ఏమీ తినదు. తిన‌టం త‌గ్గించి, ప్రత్యామ్నాయంగా పానీయాలు సేవిస్తుంది. పగటిపూట అంతా ద్రవాలను తాగుతుంది. రాత్రికి భోజ‌నం చేస్తుంది. ఉదయం ఉపవాసం కోసం మొత్తం ద్రవాలను తీసుకునేందుకు ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల ఉపవాసం సులభం అవుతుంది. మలైకా ఉదయం పూట‌ కొబ్బరి నీళ్ళు, జీరా నీరు .. సాదా నీరు స‌హా రక‌రకాల పానీయాలను తీసుకుంటుంది.

ABC జ్యూస్ ని ప్ర‌ధానంగా తీసుకుంటుంది. ఏబిసి జూస్ అంటే యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ అని అర్థం. ఉదయం 10 గంటలకు ఈ ఆరోగ్యకరమైన జ్యూస్‌ని సిప్ చేస్తుంది. అల్లం క‌లిపిన యాపిల్స్, బీట్‌రూట్‌లు క్యారెట్‌ల మిశ్రమం. ఈ పదార్థాలన్నీ మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, క్యారెట్‌లో విటమిన్ ఎ, ఇ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఆరోగ్యకరమైన శరీరం కోసం పురాతన ఉపాయాలలో అల్లం ఒకటి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.