మత్తు కళ్ల లేడీ బాస్ కిల్ చేస్తోందిగా
మత్తు కళ్లతో చిత్తు చేస్తోంది. వాలు చూపులతో వలలు వేస్తోంది. బ్లేజర్‌లో లేడీ బాస్ వైబ్స్ తో మతులు చెడగొడుతోంది.
By: Tupaki Desk | 20 Nov 2024 4:15 AM GMTమత్తు కళ్లతో చిత్తు చేస్తోంది. వాలు చూపులతో వలలు వేస్తోంది. బ్లేజర్‌లో లేడీ బాస్ వైబ్స్ తో మతులు చెడగొడుతోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ అంటే? పరిచయం అవసరం లేదు. ది గ్రేట్ మలైకా అరోరా గురించే ఇదంతా. ఇటీవలే అర్జున్ కపూర్ నుంచి విడిపోయిన ఈ బ్యూటీ .. ఇప్పుడు కెరీర్‌పైనే ఫుల్ గా ఫోకస్ పెడుతోంది. బుల్లితెర రియాలిటీ షోలు.. మోడలింగ్ అసైన్‌మెంట్స్ తో బిజీగా ఉంది.
మరోవైపు సోషల్ మీడియాల్లో అదిరిపోయే ఫోజులతో కట్టిపడేస్తున్న మలైకా.. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోషూట్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. ఈ కొత్త లుక్‌లో బాస్-ఉమెన్ వైబ్స్ ని వెదజల్లుతోంది. మలైకా బూడిద రంగు ఫార్మల్ స్కర్ట్ ధరించి కనిపించింది. ఈ స్కర్ట్ మలైకా అందాన్ని డైనమిజాన్ని పదింతలు పెంచింది.
మలైకా ధరించిన వైట్ షర్ట్.. డిజైనర్ దుస్తులకు తగ్గట్టే అదే రంగులో ఫుల్-లెంగ్త్ కోటును ధరించింది. అరోరా ధరించిన ఎలివేటెడ్ ఫార్మల్ దుస్తులు హెలెన్ ఆంథోనీ నుండి ఎంపిక చేసినవి. తన లుక్‌ని ఎలివేట్ చేయడానికి రూప వోహ్రా ఫైన్ జ్యువెలరీ నుండి బంగారు గాజులను ధరించింది. సీనియర్ నటి చంకీ బ్యాంగిల్స్‌ను ధరించింది. మలైకా లుక్ ని మేనకా హరిసింఘాని తీర్చిదిద్దారు. ఈ లుక్‌తో మలైకా ఫార్మల్ వేర్‌ను ఎలా ఎలివేట్ చేయొచ్చో చూపించింది.