49 ఏజ్ నటి దృష్టిలో 'విషపూరిత వ్యక్తి' ఎవరు?
మలైకా చేసిన తాజా వ్యాఖ్య (సోషల్ మీడియా పోస్ట్) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే...
By: Tupaki Desk | 11 Nov 2024 4:30 AM GMTలవ్ బ్రేకప్ అయితే ప్రేయసి లేదా ప్రియుడు సహచరి లేదా సహచరిపై ఎలాంటి ఫిర్యాదు చేస్తారు? ఇది ఎవరైనా గెస్ చేయలేని విధంగా ఉంటుందా? ఏదైనా బంధం బ్రేక్ అయ్యాక ఒకరిపై ఒకరు గరంగరంగా మారతారు. ఆ ఎమోషనల్ మూవ్ మెంట్ అలాంటిది. అయితే అలాంటి ఒక సందర్భం ఎదురైనా కానీ గమ్మున ఉండడం కొందరికే కుదురుతుంది.
ఈ ఏడాది ఆరంభంలోనే మలైకా అరోరా - అర్జున్ కపూర్ జంట విడిపోయారంటూ ప్రచారమైంది. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎవరి దారిలో వారు ఉన్నారు. కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఒకరి గురించి ఒకరు ఫిర్యాదులు చేయలేదు. బ్రేకప్ కి కారణం చెప్పలేదు. కేవలం స్నేహంగా ఉన్నారులే! అని ప్రజలు కూడా అనుకున్నారు.
కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియా కామెంట్ల ద్వారా మలైకాలోని అసంతృప్తి బయటపడుతూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక చిన్న లైన్ లో చెణుకులు విసరడం రివాజుగా మారింది. అర్జున్ కపూర్ ఇప్పటివరకూ మలైకా గురించి ఎలాంటి వ్యాఖ్య చేయకపోయినా.. మలైకా చేసిన తాజా వ్యాఖ్య (సోషల్ మీడియా పోస్ట్) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే...
మలైకా అరోరా ఫిట్‌నెస్ - వెల్‌నెస్ క్లాసుల గురించి తెలిసిందే. ఈ నెలలో వెల్‌నెస్ ఛాలెంజ్‌ని స్వీకరించింది. అర్జున్ కపూర్ నుంచి విడిపోయానని బహిరంగంగా ధృవీకరించిన తర్వాత ఈ మార్పు. మలైకా తన `నవంబర్ ఛాలెంజ్`ని ఇన్ స్టాలో షేర్ చేసి.. ఇందులో ఆల్కహాల్ తో పాటు విషపూరిత వ్యక్తులను తగ్గించాలని సూచించింది.
మలైకా అరోరా నవంబర్ ఛాలెంజ్ వివరాల్లోకి వెళితే.. 1. మద్యం వద్దు. 2. ఎనిమిది గంటల నిద్ర. 3. గురువును పొందండి. 4. రోజూ వ్యాయామం చేయండి. 5. రోజుకు పదివేల అడుగులు తప్పనిసరి. 6. రోజూ ఉదయం 10 గంటల వరకు ఉపవాసం ఉండండి. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. 8. రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తీసుకోవద్దు. 9. విషపూరితమైన వ్యక్తులను తొలగించండి.. అని రాసింది. అయితే అంతా బాగానే ఉంది కానీ, చివరిలో 9వ పాయింట్ మాత్రం చర్చకు వచ్చింది. ఈ క్రిప్టిక్ నోట్ ఎవరిని ఉద్ధేశించి? అంటూ అరాలు తీయడం మొదలైంది.
ప్రతి సానుకూల ఆలోచన మీ జీవితాన్ని మార్చే నిశ్శబ్ద ప్రార్థన. శుభోదయం.. మంచి రోజు.. అంటూ ఇంతకుముందు సోషల్ మీడియాల్లో సందేశం ఇచ్చింది. ప్రియుడితో బ్రేకప్ తర్వాత మలైకాలో వచ్చిన మార్పుకు సూచిక ఇది. ఈ క్లిష్ఠ సమయంలో మలైకా ప్రేరణ, ఆత్మపరిశీలనలో బిజీగా ఉందని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు విషపూరిత వ్యక్తులను దూరం పెట్టండి! అని సూటిగా చెప్పేసింది మలైకా. దీని అర్థం..ఏమిటి? మలైకా ఉద్ధేశం ఏమై ఉంటుంది? అంటూ ఇది సందేహాలను రాజేసింది.
అయితే ఇది అర్జున్ ని ఉద్ధేశించిన వ్యాఖ్య అనుకోవచ్చా? అంటూ నెటిజనులు ఆరాలు తీస్తున్నారు. ఇక అర్జున్ కపూర్ సింగం ఎగైన్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ తాను డేటింగ్ లో లేనని ధృవీకరించాడు. సింగం ఎగైన్ చిత్రానికి సంతకం చేసినప్పుడు నేను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, మానసికంగా, శారీరకంగా నా జీవితంలో చెత్త దశను ఎదుర్కొంటున్నాను అని అర్జున్ కపూర్ అన్నాడు. అర్జున్ తేలికపాటి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, మానసికంగా శారీరకంగా మెరుగ్గా ఉండటానికి కష్టపడుతున్నాడని కూడా వెల్లడించాడు. దీనిని బట్టి ఆ ఇద్దరి మధ్యా స్ట్రెస్ ను ప్రజలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.