చీరలో జిల్లనిపించిన మలైకా అరోరా
ఇటీవల తన ఇన్ స్టాలో షేర్ చేసిన వరుస ఫోటోషూట్లు ఈ వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 3:50 AM GMTఒకసారి నల్ల చీరలో కనిపించింది.. మరోసారి ఎర్ర చీరలో జిల్లనిపించింది. అంతలోనే అల్ట్రా మోడ్రన్ రేయాన్ కోట్ లో దర్శనమిచ్చింది. ఫ్యాషనిస్టా మలైకా అరోరా (మల్లా ముద్దు పేరు) ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. 50 ప్లస్ వయసులోను మల్లా చెలరేగుతోంది. నిరంతరం యూత్ కళ్లన్నీ తైనవైపే తిప్పుకునేలా చేస్తోంది.
ఇటీవల తన ఇన్ స్టాలో షేర్ చేసిన వరుస ఫోటోషూట్లు ఈ వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. రెండు రోజుల క్రితమే బ్లాక్ శారీ- వైట్ బ్లౌజ్ ని ధరించిన ఫోటోగ్రాఫ్ ని మలైకా ఇన్ స్టాలో షేర్ చేసింది. అది యూత్ కళ్లను ఆకర్షించింది. ఇంతలోనే ఇప్పుడు ఎర్రచీరలో పార్టీకి వెళుతూ జిల్లనిపించింది. చీరల్లో మతి చెడే టోన్డ్ బాడీ ని మలైకా ఎలివేట్ చేస్తున్న తీరు చర్చగా మారింది. ఎర్రచీరలో మలైకా అలా కార్ దిగి వెళుతున్నప్పటి ఓ వీడియోను వైరల్ భయానీ షేర్ చేయగా అది అంతర్జాలంలో క్షణాల్లో వైరల్ అయింది.
ఇక మలైకా ఎక్కడ ఉన్నా ఇటీవలి కాలంలో తనతో పాటే ఒక కుక్క కూడా వస్తోంది. దానిని మల్లా ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. అర్జున్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత మలైకా సాంత్వన కోరుకుంటోంది. పెట్స్ తో స్నేహంలో సాంత్వన దొరుకుతోందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆసక్తికరంగా రెడ్ హాట్ శారీలో పార్టీకి అడుగుపెట్టగా, అక్కడ తన కోసం వేచి చూస్తోంది ఎవరో తెలుసా? తన ఎక్స్ బోయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్, అతడి బృందం. నిజంగానే ఆ ఇద్దరి మధ్యా బాండింగ్ షాకిస్తోంది కదూ?