ఫోటో స్టోరి: మైకం కమ్మేలా మలైకా ఫ్యాషన్ గోల్స్
మలైకా తాజాగా ఆల్ బ్లాక్ కలర్ డిజైనర్ గౌన్ ధరించి అదిరిపోయే ఫోజులివ్వగా, ఆ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 12 Feb 2025 4:18 AM GMTఅర్జున్ కపూర్- మలైకా అరోరా జంట గత ఏడాది ఆరంభంలో బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. మలైకా నుండి విడిపోయిన విషయాన్ని అర్జున్ స్వయంగా ధృవీకరించారు. కానీ అతడిని ఇప్పటికీ ఫ్యాన్స్ వెంబడిస్తూ, మలైకా పేరుతో పబ్లిక్ లో డిస్ట్రబ్ చేస్తున్నారు. తాజాగా అర్జున్ కపూర్ నటించిన `మేరే హస్బెండ్ కి బివి` ప్రమోషన్స్‌లో మలైకా అరోరా పేరును ప్రస్థావిస్తూ, అభిమాని బిగ్గరగా అరిచిన వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
తన మాజీ ప్రేయసి మలైకా అరోరా పేరును పిలుస్తూ అతడు అరిచినప్పుడు అర్జున్ కపూర్ నోట మాట రాలేదు. ఆ సమయంలో అర్జున్ ప్రశాంతంగా ఉన్నాడు.. మౌనాన్ని ఆశ్రయించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. తన కథానాయికలు భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో `మేరే హస్బెండ్ కి బివి`ని ప్రమోట్ చేస్తున్న అర్జున్ కపూర్ కి ఇది ఊహించని జోల్ట్. సినిమా గురించి ఒక ప్రశ్నకు భూమి ఫెడ్నేకర్ సమాధానం చెప్పబోతుండగా, ఎవరో అకస్మాత్తుగా `మలైకా` అని బిగ్గరగా అరవడం వినిపించింది. అర్జున్ సహా అందరూ ఆ అరుపును గమనించారు. అలా అరవొద్దని అర్జున్ మౌనంగా చెప్పాడు.
ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన `మేరే హస్బెండ్ కి బివి`లో డినో మోరియా, హర్ష్ గుజ్రాల్, శక్తి కపూర్ సహాయక పాత్రల్లో నటించారు. వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్‌లు నిర్మించిన ఈ చిత్రం 21 ఫిబ్రవరి 2025న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
మలైకా ఫోటోషూట్లు వైరల్:
మరోవైపు మలైకా వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. మలైకా తాజాగా ఆల్ బ్లాక్ కలర్ డిజైనర్ గౌన్ ధరించి అదిరిపోయే ఫోజులివ్వగా, ఆ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఈ యూనిక్ డిజైనర్ లుక్ కోసం 50 ఏళ్ల మలైకా ఎంపిక చేసుకున్న జువెలరీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వయసులోను మల్లా అందచందాలకు యూత్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం మలైకా ఆల్ బ్లాక్ లుక్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.