Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : హీరోయిన్‌ అందాల సన్‌ బాత్‌

అలాంటి మలైకా అరోరా మరోసారి తన అందమైన ఫోటోలతో సోషల్‌ మీడియా ద్వారా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

By:  Tupaki Desk   |   7 Jan 2025 2:30 PM GMT
పిక్‌ టాక్‌ : హీరోయిన్‌ అందాల సన్‌ బాత్‌
X

బాలీవుడ్‌తో పాటు సౌత్‌ ప్రేక్షకులకు మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఇప్పటికీ ఈమె జోరు కొనసాగుతూనే ఉంది. వయసు 50కి చేరినా అందం మాత్రం 30 వద్ద ఆగిపోయింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆమె తలుచుకుంటే, ఆసక్తి చూపిస్తే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకోగల సత్తా ఉన్న నటి, అంతటి అందం ఉన్న ముద్దుగుమ్మ అనడంలో సందేహం లేదు. అలాంటి మలైకా అరోరా మరోసారి తన అందమైన ఫోటోలతో సోషల్‌ మీడియా ద్వారా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజా ఫోటోల్లో మలైకా అరోరా సన్‌ బాత్‌ చేస్తోంది.


1998లో దిల్‌ సే సినిమాలో చయ్యా చయ్యా సాంగ్‌లో కనిపించడం ద్వారా మలైకా ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌ అయ్యింది. ఆ పాట మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎన్నో స్పెషల్‌ సాంగ్స్ చేయడంతో పాటు ఎన్నో సినిమాల్లో నటించింది. మలైకా ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఆకట్టుకుంది. అందమైన ఈ అమ్మడికి ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినా కొన్ని సినిమాలు మాత్రమే చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగింది. వ్యక్తిగత విషయాల వల్ల ఆమె కొంత మేరకు కెరీర్‌ నాశనం అయినా ఆమెను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు అనడంలో సందేహం లేదు.


అలాంటి మలైకా అరోరా తాజాగా షేర్‌ చేసిన ఈ సన్‌ బాత్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. మార్నింగ్‌ సమయంలో ఎక్సర్‌సైజ్‌ చేసి ఆ తర్వాత రిలాక్స్‌గా కింద పడుకుని సన్‌ బాత్‌ చేస్తుంది. చలికాలం సూర్యుడు భలేగా ఉన్నాడు అన్నట్లు ఈ ఫోటోలతో పాటు కామెంట్‌ షేర్ చేసింది. మలైకా అరోరా సోషల్‌ మీడియాలో దాదాపుగా 19 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేయకున్నా ఈ స్థాయిలో ఫాలోవర్స్‌ను కలిగి ఉండటం అంటే మామూలు విషయం కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులోనూ ఇంతటి అందంగా ఎలా కనిపిస్తున్నారో అర్థం కావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ఆ మధ్య ఒక యంగ్‌ హీరోతో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. కానీ ఈమధ్య కాలంలో ఆ రిలేషన్‌ షిప్ నుంచి మలైకా దూరం జరిగిందని అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. అయిదు పదుల వయసుకు చేరువ అయిన మలైకా అరోరా మరో పదేళ్ల పాటు ఇదే అందంతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. సినిమాల్లో ఈ అందం నటిస్తే బాగుంటుందని, వెండి తెరపై మరింత ఈమెను చూడాలని అనుకుంటున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మలైకా అరోరా సోషల్‌ మీడియాలో మాత్రం క్రమం తప్పకుండా నెటిజన్స్‌ను అలరిస్తూ అందంతో కన్నుల విందు చేస్తోంది.