శీలం కోల్పోయావా? కొడుక్కి మలైకా ప్రశ్న!
మలైకా ప్రశ్నకు అర్హాన్ ఖాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే...నాకు నిజాయితీగా సమాధానం ఇవ్వండి. జస్ట్ బ్లడీ నాకు ఆన్సర్ ఇవ్వండి.. అని వ్యాఖ్యానిస్తుంది.
By: Tupaki Desk | 17 April 2024 12:31 PM GMTహాఫ్ సెంచరీ కొట్టేసినా మలైకా అరోరాలో టీనేజీ వైబ్స్ ఇంకా మిస్ కాలేదు. మనసుండాలే కానీ.. వయసుతో పనేం ఉంది! అన్న చందంగా...! వృద్ధాప్యాన్ని ఈ భామ దరి చేరనివ్వడం లేదు! 50 ఏళ్ల వయసులోను తనదైన అందం కవ్వింతతో నెటిజనులను మైమరిపిస్తూనే ఉంది మలైకం. తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. మలైకా ఇటీవల తన కుమారుడు అర్హాన్ ఖాన్ వోడ్‌కాస్ట్ 'డంబ్ బిర్యానీ'లో కనిపించడం వివాదానికి దారితీసింది.
వోడ్‌కాస్ట్ రెండవ ఎపిసోడ్‌లో మలైకా తన కుమారుడు అర్హాన్‌తో సంభాషించింది. అర్హాన్ ని మలైకా ఊహించని ఒక ప్రశ్న అడిగింది. నీ శీలాన్ని ఎప్పుడు కోల్పోయావు? అనేది ఈ ప్రశ్న. అర్హాన్ ఆశ్చర్యకరంగా స్పందించగా, మలైకా సమాధానం కోసం పట్టుబట్టింది. అయితే ఇదే వేదికపై మలైకా వివాహ ప్రణాళికల గురించి కుమారుడు అర్హాన్ ప్రశ్నించారు.
అయితే మలైకా- అర్హాన్ లాంటి మోడ్రన్ డే తల్లి కొడుకు బంధం విలక్షణమైనది. వారు ప్రతిదీ స్వేచ్ఛగా సంభాషించగలరు. వారు ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. పాశ్చాత్య పోకడలకు పోగలరు. కానీ దీనని అర్థం చేసుకుని వారు ఇది అసహ్యంగా ఉందంటూ కామెంట్ చేసారు. అర్హాన్ కి గోప్యత లేకుండా చేయడం సరికాదని మలైకాను వారించారు. కారణం ఏదైనా కానీ ఇప్పుడు మలైకా ప్రశ్నపై పెద్ద డిబేట్ కొనసాగుతోంది.
మలైకా ప్రశ్నకు అర్హాన్ ఖాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే...నాకు నిజాయితీగా సమాధానం ఇవ్వండి. జస్ట్ బ్లడీ నాకు ఆన్సర్ ఇవ్వండి.. అని వ్యాఖ్యానిస్తుంది. ఇంతలోనే ఈ క్లిప్ తర్వాత అర్హన్ ఖాన్ స్నేహితులను పరిచయం చేస్తుంది. వారు కూడా తమ తల్లులతో అదే విధంగా స్పైసీ సంభాషణలలో పాల్గొంటారు.
ఖాన్ తన తల్లిని వైవాహిక ప్రణాళికల గురించి ప్రశ్నించే సాహసం చేయడంతో వోడ్ కాస్ట్ సంభాషణ తీవ్ర మలుపు తిరుగుతుంది. అయితే మలైకా అరోరా ప్రస్తుతం నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. ఈ డేటింగ్ బహిరంగం. త్వరలోనే పెళ్లాడుతారని ప్రచారం కూడా ఉంది. మలైకా అరోరా తన కొడుకు ప్రశ్నకు ఎగతాళిగా స్పందిస్తూ, ''నువ్వు నిజాయితీగా ఉంటావని అనుకుంటున్నావా? ఎందుకంటే నేను చాలా స్పైసీగా ఉంటాను'' అనే వ్యాఖ్యలు ఈ వీడియోలో కనిపించాయి. ఇకపోతే పూర్తి ఇంటర్వ్యూగా దీనిని వీక్షించాక మాత్రమే వారి సంభాషణల అంతర్యం ఏమిటి? అనేది విశ్లేషించగలం.