Begin typing your search above and press return to search.

ఒంపుసొంపుల వ‌ల‌లు విసిరిన‌ మలైకా

బీచ్‌లో ప్రింటెడ్ బికినీలో సహజమైన బ్లూ వాట‌ర్ ని చూస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   17 July 2024 2:05 AM GMT
ఒంపుసొంపుల వ‌ల‌లు విసిరిన‌ మలైకా
X

మలైకా అరోరా తాజా విహార యాత్ర అగ్గి రాజేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా స్పెయిన్‌లోని మార్బెల్లాలో బీచ్ విహారయాత్ర నుండి వ‌రుస‌ బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో వేడిని పెంచుతోంది. బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా ప్రింటెడ్ బికినీలో తన టోన్డ్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తున్న ర‌స‌వ‌త్త‌ర‌మైన‌ ఫోటోను ఇంత‌కుముందే మ‌లైకా షేర్ చేసింది.

మలైకా అరోరా తాజా విహార యాత్ర అగ్గి రాజేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా స్పెయిన్‌లోని మార్బెల్లాలో బీచ్ విహారయాత్ర నుండి వ‌రుస‌ బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో వేడిని పెంచుతోంది. బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా ప్రింటెడ్ బికినీలో తన టోన్డ్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తున్న ర‌స‌వ‌త్త‌ర‌మైన‌ ఫోటోను ఇంత‌కుముందే మ‌లైకా షేర్ చేసింది. ఆమె సొట్టబుగ్గల ఫోటో వైరల్‌గా మారి అభిమానులను ఉర్రూతలూగించింది. కొన్ని వ‌రుస ఫోటోషూట్ల నుంచి మ‌లైకా ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. బీచ్‌లో ప్రింటెడ్ బికినీలో సహజమైన బ్లూ వాట‌ర్ ని చూస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. తన ఫోటోపై `సర్ఫ్స్ అప్` స్టిక్కర్‌ను ఉంచింది. మలైకా తాజా హాట్ ఫోటో అభిమానులను ఊపిరి పీల్చుకోనివ్వ‌ని ట్రీటిచ్చాయి.

ఇంత‌లోనే మ‌లైకా ప‌సుపు రంగు బికినీలో అదిరిపోయే ఫోజ్ ఇవ్వ‌గా ఆ ఫోటో అంత‌ర్జాలంలో ట్రెండింగ్ గా మారింది. ఇది కూడా స్పెయిన్ ట్రిప్ నుంచి వ‌చ్చిన లేటెస్ట్ ఫోటో. మ‌లైకా స్ఫూన్‌తో ఏదో సేవిస్తూ ప‌సుపు రంగు బికినీలో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. బీచ్ ఎండ నుంచి ర‌క్ష‌ణగా షేడ్స్ ని ధ‌రించింది ఈ బ్యూటీ. అదిరిపోయే ఫోటోషూట్ తో మ‌తులు చెడ‌గొడుతోంది మ‌లైకా అంటూ దీనికి కామెంట్లు వ‌చ్చి ప‌డుతున్నాయ్.

మలైకా స్పెయిన్‌లో జాలీ సమయాన్ని ఆస్వాధిస్తున్నప్ప‌టికీ త‌న వ్యక్తిగత జీవితం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తూనే ఉంది. ఇటీవల నటుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్‌పై పుకార్లు హెడ్ లైన్స్ లో కొచ్చాయి. ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు క‌ల‌వ‌డం లేదు. వేడుక‌లు జ‌ర‌ప‌డం లేదు. మ‌లైకా నిగూఢ‌మైన పోస్టుల్లో అర్థాలు వెతుకుతున్నారు. అర్జున్‌తో తన ఆన్-ఆఫ్ రిలేషన్ పై పుకార్లను స‌హించ‌న‌ని మ‌లైకా ఆవేశంగా అన‌డంతో సందేహాలు రాజుకున్నాయి. మ‌లైకా ఇటీవ‌ల ఎంతో భావోద్వేగంతో క‌నిపిస్తుండ‌డాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హించారు.

కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు:

తన వెకేషన్ అప్‌డేట్స్ అందిస్తూనే.. ఈ మధ్యలో మలైకా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి కొంత సమయం కేటాయించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నూతన వధూవరుల అందమైన ఫోటోను షేర్ చేస్తూ-``అనంత్ - రాధికల అందమైన క‌ల‌యిక సెల‌బ్రేష‌న్ .. మీరు చేతులు క‌లిపి ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నప్పుడు మీ ఇద్దరికీ ప్రపంచంలో అన్ని సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను`` అని రాసింది.