అర్జున్‌తో మలైకా బ్రేకప్.. ఇన్ని గొడవలు అయ్యాయా?
అయితే దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మలైకా అరోరా సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ కుటుంబాన్ని అన్‌ఫాలో చేసింది.
By: Tupaki Desk | 27 Aug 2023 5:07 AM GMTసల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన డ్యాన్సింగ్ క్వీన్ మలైకా అరోరా ఖాన్ అటుపై బోనీకపూర్ కుమారుడు అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ కొనసాగించిన సంగతి తెలిసిందే. 48ఏళ్ల మలైకా 36 ఏళ్ల అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించడం సంచలనమైంది. ఈ జంట బహిరంగ ప్రదర్శనలకు అంతా విస్తుపోయారు. అయితే వీరి స్నేహాన్ని అర్థం చేసుకుని ఎంకరేజ్ చేసినవారికి కొదవేమీ లేదు.
తమ మధ్య ఈ బంధం ఎంతో సురక్షితంగా ఉందని మలైకా అరోరాఖాన్ చాలా సందర్భాల్లో వెల్లడించింది. అర్జున్ కపూర్ తో స్నేహం ప్రేమ తదుపరి స్థాయికి చేరుకుంటాయని అభిమానులు భావించారు. ఇక ఈ జంట పెళ్లి గురించి మీడియా అత్యుత్సాహం ప్రదర్శించినా కానీ అది ఖరారు కాలేదు. మలైకా కానీ అర్జున్ కానీ వివాహంపై ఏనాడూ ఆసక్తిని కనబరచలేదు. ఆనందంగా జీవితం సాగడం చాలా ముఖ్యం అనే ధోరణి మాత్రమే ఈ జంటలో కనిపించింది. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య మనస్ఫర్థలు తలెత్తాయని ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. మలైకా- అర్జున్ విడిపోయి ఎవరి దారిలో వారు ఉన్నారని కూడా ముంబై మీడియాలో కథనాలొస్తున్నాయి. అయితే దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మలైకా అరోరా సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ కుటుంబాన్ని అన్‌ఫాలో చేసింది. దీని అర్థం విడిపోవడమేనని ఇప్పుడు అంతా భావిస్తున్నారు.
మలైకా అరోరా- అర్జున్ కపూర్ గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అతడు మరో అందాల గువ్వతో షికార్లు చేస్తున్నాడు. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ తో ప్రేమలో పడ్డాడు! అంటూ ప్రచారం సాగుతోంది. అందమైన యువతితో ప్రేమలో పడడం వల్లనే మలైకాకు బ్రేకప్ చెప్పేశాడని కూడా టాక్ వినిపిస్తోంది.
అర్జున్ కపూర్ సోదరీమణులు అన్షులా కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ల ఈవెంట్లకు దూరమైన మలైకా వారిని అన్ ఫాలో చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఇంతలోనే అర్జున్ ని మలైకా అన్ ఫాలో చేసింది. ఇది జరిగినప్పటి నుండి మలైకా - అర్జున్ ఒకరితో ఒకరు పోటీపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిప్టిక్ సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ''మార్పు అనేది జీవిత చట్టం... గతం లేదా వర్తమానం వైపు మాత్రమే చూసేవారు భవిష్యత్తును కోల్పోతారు'' అంటూ మలైకా రాసిన కామెంట్ చూడగానే ఈ జంట బ్రేకప్ ఖాయమైందని అర్థమవుతోంది.