Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని నిషేధించిన ఒంట‌రి దీవిలో మ‌లైకా

అభిమానులు త‌మ అభిమాన బికినీ దేవ‌త‌కు స్పందిస్తూ ల‌వ్, హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 4:29 AM GMT
ప్ర‌ధాని నిషేధించిన ఒంట‌రి దీవిలో మ‌లైకా
X

బ్రేక‌ప్ వార్త‌ల‌తో ఇటీవ‌ల మ‌లైకా హెడ్ లైన్స్ లోకొచ్చింది. యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో బ్రేక‌ప్ త‌ర్వాత కొత్త బోయ్ ఫ్రెండ్ తో షికార్ మొద‌లు పెట్టింద‌ని పుకార్లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు అవేమీ ప‌ట్ట‌న‌ట్టు బికినీ బీచ్ విహారంలో మ‌ల్లా(మ‌లైకా) సేద దీరుతోంది. మలైకా అరోరా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. తన సోషల్ మీడియాల్లో సంథింగ్ స్పెష‌ల్ ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా అది ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. చిరుతపులి ప్రింటెడ్ బికినీలో మ‌లైకా తన వొంపుసొంపుల‌ను ప్ర‌ద‌ర్శించింది. 50 ఏళ్ల ఈ బ్యూటీ వ‌డ్డ‌న‌ల‌కు యువ‌త‌రం ఫిదా అయిపోతున్నారు. అభిమానులు త‌మ అభిమాన బికినీ దేవ‌త‌కు స్పందిస్తూ ల‌వ్, హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.


మాల్దీవుల విహారాన్ని మ‌లైకా ఒక రేంజులో ఆస్వాధిస్తోంది. అక్క‌డ పూల్ లో ఆస్వాధిస్తూ ఈత కొడుతోంది. బీచ్ లో బికినీల‌తో చెల‌రేగుతోంది. అంతేకాదు మాల్దీవుల‌కు మ‌లైకా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారింది. ఈ బ్యూటీ దానిని స్వర్గం అని పొగిడేసింది. అభిమానుల్లో ఒకరు `50 ఏళ్ల హా*స్ట్ మహిళ`` అని రాశారు. మలైకా నేను నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాను.. నేను పెద్ద అభిమానిని.. అని మ‌రొక అభిమాని వ్యాఖ్యానించారు.


మలైకా అరోరా ఇటీవలే ఒలింపిక్స్ 2024 కోసం పారిస్ లో విహ‌రించింది. స్పాట్ నుంచి తన అద్భుతమైన లుక్‌లను రిలీజ్ చేసి హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. పారిస్‌లో తన గోల్డెన్ అవర్ మూమెంట్ నుండి రెండు ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా అవి ల‌క్ష‌ల్లో లైక్ లు అందుకున్నాయి. ఇంత‌లోనే ఇప్పుడిలా మాల్దీవుల విహారం నుంచి సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మైంది.


అయితే మ‌లైకా మాల్దీవుల విహారాన్ని కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు. ఆ దీవులను భారత ప్ర‌ధాని నిషేధించారు. సెల‌బ్రిటీలు అలాంటి చోటికి వెళ్ల‌కూడ‌ద‌ని, భార‌త‌దేశం తీరం వెంబ‌డి అంత‌కంటే అద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్ నేచుర్ ఉంద‌ని నిరూపిస్తూ ఇంత‌కుముందు ల‌క్ష్య‌ద్వీప్ ని ప్ర‌మోట్ చేసారు. కానీ మ‌లైకా అలాంటి చోటికి వెళ్ల‌కుండా ఇప్పుడు మ‌న శ‌త్రు దేశానికి వెళ్లింది.. అంటూ అభిమానులు దుయ్య‌బ‌డుతున్నారు.


మ‌రోవైపు 50 ఏళ్ల వయస్సులో ఇంకా ఫిట్‌గా ఉన్నందుకు మలైకా అరోరాను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. మ‌లైకా ఫ్యాషన్ , ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సెల్ఫ్ మేడ్ ఉమెన్ క్వాలిటీ, బాలీవుడ్‌లో చాలా బలమైన వ్యక్తిత్వం, స్టైలిష్ ఐకాన్ అంటూ కొంద‌రు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. తరుణ్ మన్సుఖాని తెర‌కెక్కిస్తున్న‌ కామెడీ చిత్రం `హౌస్‌ఫుల్ 5`లో మలైకా అరోరా అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, కృతి సనన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనిల్ కపూర్, అభిషేక్ వంటి భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. 6 జూన్ 2025న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఆ మేర‌కు అధికారిక ప్రకటనను విడుదల చేసారు.