Begin typing your search above and press return to search.

నియోన్ గ్రీన్ లో ఊపేస్తోన్న‌ మలైకా!

బాలీవుడ్ స‌రైన్ మ‌లైకా అరోరా ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఇన్ స్టాకి ఎక్కిందంటే త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రి.

By:  Tupaki Desk   |   15 July 2024 5:46 AM GMT
నియోన్ గ్రీన్ లో  ఊపేస్తోన్న‌ మలైకా!
X

బాలీవుడ్ స‌రైన్ మ‌లైకా అరోరా ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఇన్ స్టాకి ఎక్కిందంటే త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. సొగ‌స‌రి ఎలాంటి దుస్తుల్లోనైనా అగ్గిరాజేసే అందాల‌తో అద‌ర గొడుతుంది. వ‌య‌సు ముదురుతోన్న న‌వ నాయిక‌లా ఇప్ప‌టికీ అదే క్రేజ్ తో నెట్టింట సంచ‌ల‌నం అవుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి బీచ్ బికినీలో చెల‌రేగింది. ఇదిగో ఇక్క‌డిలా నియోన్ గ్రీన్ బీచ్ దుస్తుల్లో అమ్మ‌డు సెగలు పుట్టిస్తుంది.

అమ్మ‌డు క్లోజ‌ప్ లో రెండు సెల్పీలు పోస్ట్ చేసి హీటెక్కించే ప‌ని పెట్టుకుంది. ఓ పిక్ లో వొంగుని స్పూన్ తో తింటూ ఫోజులివ్వ‌గా..మ‌రో పిక్ లో గ్లామ‌ర్ డోస్ ని క్లోజప్ లో రివీల్ చేసింది. ఇందులో అమ్మ‌డు ఎండ తీవ్ర‌త‌ను త‌ట్టుకునేలా క‌ళ్ల‌కు గ్లాసెస్ ధ‌రించింది. ప్ర‌స్తుతం ఈఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అయితే అమ్మ‌డిలా సోలోగా క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్రియుడు అర్జున్ క‌పూర్ ఎక్క‌డ‌? అంటూ కామెంట్లు క‌నిపిస్తున్నాయి. అంబానీ ఇంట పెళ్లిలో క‌పూర్ బోయ్ మెరిసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ మూడు రోజుల వేడుక‌లో ఎక్క‌డా మ‌లైకా క‌నిపించ‌లేదు. చూస్తుంటే అంబానీ ఇంట పెళ్లి జ‌రుగుతుంటే మ‌లైకా వెకేష‌న్ ని ఆస్వాదిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక మ‌లైకా-అర్జున్ మ‌ధ్య దూరం పెరిగింద‌ని కొన్ని రోజుల‌గా మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. కానీ అందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది క్లారిటీ లేదు.

అలాగే మ‌లైకాకి బాలీవుడ్ లో అవ‌కాశాలు కూడా బాగా త‌గ్గాయి. మునుప‌టిలా ఛాన్సులు రావ‌డం లేదు. వ‌యోభారం స‌హా చాలా కార‌ణాలు అమ్మ‌డి కెరీర్ పై ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. ముఖ్యంగా అర్జున్ క‌పూర్ తో డేటింగ్ మొద‌లైన నాటి నుంచి వెండి తెర‌పై క‌నిపించింది లేదు. మ‌రి ఈ రిలేష‌న్ కి..ఛాన్సులు రాక‌పోవ‌డానికి కార‌ణం ఏదైనా ఉందా? అన్న గుట్టు వీడాలి.