రోడ్‌పై చెత్త ఏరుతున్న మలైకా.. నెటిజనుల డౌట్లు!
పిక్చర్ పర్ఫెక్ట్ బ్యూటీ మలైకా అరోరా స్టైలిష్ జిమ్ సెషన్స్ , కఠినమైన వ్యాయామ దినచర్యలతో నిరంతరం ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది.
By: Tupaki Desk | 29 May 2024 10:03 AM GMTపిక్చర్ పర్ఫెక్ట్ బ్యూటీ మలైకా అరోరా స్టైలిష్ జిమ్ సెషన్స్ , కఠినమైన వ్యాయామ దినచర్యలతో నిరంతరం ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. మంగళవారం నాడు ఈ బ్యూటీలో భిన్నమైన కోణాన్ని చూపించే వీడియో ఒకటి బయటపడింది. మలైకా వ్యాయామశాలకు వెళుతున్నప్పుడు గేట్ వద్ద చెత్తను గమనించింది. వెంటనే దానిని ఎత్తి డస్ట్‌బిన్‌లో పారవేసింది. ఈ ఆకస్మిక పరిణామాన్ని ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించారు. జిమ్‌లోకి అడుగుపెట్టిన ఆమె ఫోటోగ్రాఫర్‌లను ఆప్యాయంగా పలకరించింది. ఫిట్‌నెస్‌తో పాటు పరిశుభ్రత పట్ల మలైకా నిబద్ధత ను చాలా మంది అభిమానులు ప్రశంసించడంతో వీడియో వైరల్ గా మారింది.
అయితే అన్ని స్పందనలు సానుకూలంగా లేవు. కొంతమంది విమర్శకులు ఆమె కెమెరాల ముందు కావాలని ఇలా చేశారని ఆరోపించారు. రోల్ కెమెరా, యాక్షన్ ...కెమెరా ఆన్‌లో ఉందని మలైకాకు తెలుసు! వంటి కామెంట్‌లు చేసారు. ఇదంతా కేవలం ప్రదర్శన కోసం మాత్రమే అని వ్యాఖ్యానిస్తున్నారు. మిశ్రమ స్పందనలు ఉన్నప్పటికీ, మలైకా ఫిట్‌నెస్ క్లీన్‌నెస్ రెండింటిలోనూ తన చర్యలతో స్ఫూర్తిని పొందుతూనే ఉంది. మలైకా అరోరా బాలీవుడ్‌లోని ఫిటెస్ట్ నటీమణులలో ఒకరిగా విస్తృతంగా గుర్తింపు పొందింది. ఫిట్‌నెస్ పై తన అంకితభావం కఠినమైన వ్యాయామ దినచర్యలలో స్పష్టంగా కనిపిస్తుంది. స్టైలిష్ జిమ్ వేషధారణలతో ప్రతిసారీ తన తీవ్రమైన శిక్షణా సెషన్ల నుండి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంది. అది అభిమానులు, ఫిట్‌నెస్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షిస్తుంది.
రోజూ వెళ్లే మార్గంలో గేటు వద్ద కొంత చెత్త పడి ఉండటాన్ని గమనించిన మలైకా వెంటనే చర్య తీసుకుంది. మొదట తన పాదాలను ఉపయోగించి చెల్లాచెదురుగా ఉన్న చెత్తను పోగు చేసి ఆపై దానిని తన చేతులతో తీసి డస్ట్‌బిన్‌లో సరిగ్గా వేసింది. ఈ వీడియో వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.