పిక్ టాక్ : మేడం 50లోనూ 20 అందం
యంగ్ హీరోయిన్స్ కి సైతం నప్పని అందాల సిల్వర్ డిజైనర్ డ్రెస్ లో మలైకా అరోరా సూపర్ గా ఉందంటూ నెటిజన్స్ తో ప్రశంసలు దక్కించుకుంది.
By: Tupaki Desk | 10 July 2024 4:51 AM GMTబాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ మలైకా అరోరా. ఇటీవల తన 50వ ఏట అడుగు పెట్టిన మలైకా అరోరా అందాల ఆరబోత విషయంలో ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగానే ఉంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు కన్నుల విందుగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
యంగ్ హీరోయిన్స్ కి సైతం నప్పని అందాల సిల్వర్ డిజైనర్ డ్రెస్ లో మలైకా అరోరా సూపర్ గా ఉందంటూ నెటిజన్స్ తో ప్రశంసలు దక్కించుకుంది. ఈ స్థాయిలో అందాల ఆరబోత చూస్తూ ఉంటే మలైకా ఇంకా 20 నుంచి 30 మధ్య వయసులోనే ఉండి పోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి అంటున్నారు.
హీరోయిన్ గా ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఐటెం సాంగ్స్ తో పాటు సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోలు, వివాదాల కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఈ ఫోటోల కారణంగా మలైకా అరోరా వార్తల్లో నిలిచింది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ సిల్వర్ డిజైన్ డ్రెస్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇంత అందంగా ఉన్న మలైకా అరోరా సీనియర్ హీరోలకు సరిజోడీ గా ఉంటుంది. కానీ ఆమె మాత్రం ప్రస్తుతానికి నటనపై ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి ఫోటో షూట్స్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. 50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అందం అన్నట్లుగా కన్నుల విందు చేస్తుంది. ఆకట్టుకునే ఈ అమ్మడి అందం మరో పదేళ్లు అయినా ఇలాగే ఉంటుందనే అభిప్రాయం ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.