ఆ ఇద్దరు విడిపోయారా? ఇదే ఆధారమా?
సరిగ్గా అదే సమయంలో మాత్రం మళ్లీ జంటగా కనిపించి అవన్నీ తప్పుడు కథనాలు అని ప్రూవ్ చేసారు.
By: Tupaki Desk | 27 Jun 2024 11:07 AM GMTఅర్జున్ కపూర్-మలైకా అరోరా మధ్య లవ్ ఏ రేంజ్కి వెళ్లిందో తెలిసిందే. ప్రేమకు వయసుతో పనేంటి? అంటూ ఇద్దరు చెలరేగిన వైనం ఎంతో సంచలనం. ఎన్ని విమర్శలొచ్చినా? ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా ఉయ్ డోంట్ కేర్ అంటూ ముందుకు సాగారు. అటుపై కొంత కాలానికి విడిపోతున్నట్లు కూడా నెట్టింట అంతే జోరుగా ప్రచారం సాగింది. సరిగ్గా అదే సమయంలో మాత్రం మళ్లీ జంటగా కనిపించి అవన్నీ తప్పుడు కథనాలు అని ప్రూవ్ చేసారు.
ఆ తర్వాత మళ్లీ కొన్ని నెలల పాటు ఆ జోడీ టాపిక్ నెట్టింట రాలేదు. అయితే ఇటీవలే మలైకా గర్బం దాల్చిందని...అందుకు కారకుడు అర్జున్ కపూర్ అని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో ఈసారి పెళ్లి ఖాయమే అనుకున్నారంతా. కానీ ఇంతలోనే మళ్లీ ఇద్దరి గురించి బ్రేకప్ అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈసారి మరింత బలంగా బ్రేకప్ జరిగిందని కొన్ని ఆధారాలు సైతం చూపిస్తోంది సోషల్ మీడియా.
ఈ మధ్య కాలంలో ఇద్దరు కలిసి కనిపించింది లేదు. కలిసి వేడుకలకు వెళ్లినట్లు ఎక్కడా కనిపించలేదు. నైట్ పార్టీల్లోనూ..వీకెండ్ పార్టీల్లో సైతం ఎక్కడా కనిపించలేదు. ఇటీవల సింగిల్‌గానే మలైకా అరోరా కొన్ని హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. అందులో ఎక్కడా కపూర్ బోయ్ కనిపించలేదు. ఎప్పుడూ ప్రియురాలిని అంటిపెట్టుకుని ఉండే అర్జున్ మాత్రం ఈసారి హైడ్ అయ్యాడు.
తాజాగా అర్జున్ కపూర్ పుట్టిన రోజు కూడా జరిగింది. ఆ వేడుకల్లో ఎక్కడా మలైకా కనిపించలేదు. కపూర్ బోయ్ కేవలం కుటుంబ సభ్యలతోనే ఆ వేడుక సెలబ్రేట్ చేసుకున్నాడు. అదంతా పక్కనబెడితే బర్త్ డే బోయ్ కి మలైకా సోషల్ మీడియా ద్వారా కూడా విషెస్ చెప్పలేదు. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. పాలు నీళ్లలా కలిసిన ఆ జంట ఇప్పుడు ఎందుకిలా వ్యవరిస్తుందంటూ ఓ సందేహం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇద్దరు విడిపోయారని బాలీవుడ్ మీడియాలో కథనాలు అల్లుకుంటున్నాయి.