Begin typing your search above and press return to search.

ట్రెండింగ్: ర‌హ‌స్య స్నేహితుడితో మ‌లైకా?

అయితే కొన్నేళ్ల పాటు సాగించిన ఈ డేటింగ్ ను కూడా ముగించింది అంటూ మ‌లైకా గురించి గ‌త కొద్దిరోజులుగా ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   19 July 2024 4:38 AM GMT
ట్రెండింగ్: ర‌హ‌స్య స్నేహితుడితో మ‌లైకా?
X

మలైకా అరోరా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అగ్ర‌హీరో స‌ల్మాన్ సోద‌రుడు ఆర్భాజ్‌ని పెళ్లాడి 19ఏళ్ల త‌ర్వాత బ్రేక‌ప్ అయిన మ‌లైకా ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ కుమారుడు, యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ చేయ‌డం నిరంత‌రం వార్త‌ల్లో నిలిచింది. అయితే కొన్నేళ్ల పాటు సాగించిన ఈ డేటింగ్ ను కూడా ముగించింది అంటూ మ‌లైకా గురించి గ‌త కొద్దిరోజులుగా ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగుతోంది. ఆమె ఇప్పుడు అత‌డితో క‌లిసి లేదు. అత‌డి నుంచి విడిపోయింది! అంటూ ప్ర‌చారం సాగుతోంది.


ఇంత‌లోనే స్పెయిన్ విహార‌యాత్ర‌లో మిస్ట‌రీమ్యాన్‌ని ప‌రిచ‌యం చేసి బిగ్ షాకిచ్చింది మ‌లైకా. ఇప్పుడు మ‌లైకా కొత్త‌ డేటింగ్ గురించి పుకార్లు షికార్ చేస్తున్నాయి. తాజా ఫోటోగ్రాఫ్‌లో ఒక రహస్య వ్యక్తితో వెకేష‌న్‌కి సంబంధించిన‌ స్నాప్‌షాట్‌లను షేర్ చేసింది మ‌లైకా. బ్ల‌ర్ చేసిన ఫోటోలో అత‌డు అంత స్ప‌ష్ఠంగా క‌నిపించ‌డం లేదు. కానీ మిస్ట‌రీమ్యాన్ అక్క‌డ స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. అర్జున్ కంటే స్మార్ట్ గాను ఉన్నాడు.

ప్ర‌స్తుతం మ‌లైకా అర్జున్ కి దూరంగా ఉంది. స్పెయిన్ విహార‌యాత్ర‌లో ఉంది. ఈ పర్యటన కారణంగా ఎంతో కీల‌క‌మైన అంబానీల మ్యారేజ్ ఈవెంట్‌కు దూరమైంది. కానీ అక్క‌డ మిస్ట‌రీమ్యాన్ తో మ‌లైకా విహారం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. ఇటీవ‌ల స్పెయిన్ నుంచి మ‌లైకా బికినీ షాట్లు, ఆహార పానీయాల‌ విలాసాలకు సంబంధించిన ఫోటోలు సహా ఈ పర్యటన నుండి చాలా గ్లింప్స్ ని షేర్ చేసింది. ఇందులో ఒక ఫోటోలో మ‌లైకాతో పాటు రహస్య వ్యక్తిని చూపించ‌డంపైనే ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

మలైకా మార్బెల్లా(స్పెయిన్‌)లో విహారయాత్రలో ఉంది.. కానీ తన సహచరుడి గురించి మౌనంగా ఉంది. అంబానీ పెళ్లికి ఆమె గైర్హాజరు కావడానికి ఈ వెకేష‌న్ ముఖ్య‌ కారణం. అయినా కానీ అనంత్ అంబానీ -రాధిక మర్చంట్‌లకు తన శుభాకాంక్షలు తెలియజేసింది.

ఈ వేసవి ప్రారంభంలో మ‌లైకా-అర్జున్ బంధం సహజ ముగింపున‌కు చేరుకుంది. అయితే ఆ ఇద్దరూ తమ స్నేహాన్ని విడిచిపెట్ట‌లేదు. వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. సంబంధాన్ని బహిరంగంగా చర్చించకూడదని లేదా విశ్లేషించకూడదని నిర్ణయించుకున్నారు. గౌరవప్రదంగా దీనిని మ్యానేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. విడిపోయినప్పటికీ వారి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. వారు ఒకరికొకరు అపారమైన గౌరవాన్ని కలిగి ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా ఆ గౌరవాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.