మలైకా అరోరా మాల్దీవుల్లో సలసలా
మాన్సూన్ ట్రిప్ లో అక్కడి వాతావరణం, ఆహారం, దుస్తులు వగైరా వగైరా విషయాలను తాను అనుభవించిన ఆనందాన్ని ఈ ఫోటోలు ఆవిష్కరిస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Aug 2024 2:43 PM GMTఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా అరోరాఖాన్ ఆ తర్వాత అర్జున్ కపూర్ తో కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట కూడా బ్రేకప్ అయిందని కథనాలొస్తున్నాయి. బ్రేకప్ అయినా స్నేహంగా ఉన్నారు. అయితే ఇంతలోనే మలైకా విదేశీ విహారయాత్రలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇంతకుముందే ఎగ్జోటిక్ డెస్టినేషన్ నుంచి లీకైన ఫోటోల్లో మలైకాతో పాటు షాడో మ్యాన్ ప్రత్యక్షమయ్యాడు. దీంతో మలైకా కొత్త బోయ్ ఫ్రెండ్ అతడే అంటూ ప్రచారం మొదలైంది.
ఇప్పుడు మలైకా మాల్దీవుల విహారం నుంచి వరుస ఫోటోలను షేర్ చేస్తోంది. మాల్దీవులలో వర్షాకాలం సీజన్‌ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. వెకేషన్ నుండి కొన్ని బికినీ ఫోటోలను తన ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్స్ పరిశీలిస్తే మల్లా మునుపటి కంటే హ్యాపీగా కనిపిస్తోంది. ఆనందంగా జాలీగా టైమ్ ని స్పెండ్ చేస్తోందని అర్థమవుతోంది. జీవితంలో అనేక మజిలీలు అలా వచ్చి పోతుంటాయి. ఎప్పటికీ ఆనందం పర్మినెంట్ అనే సంకేతాన్ని మలైకా ఇతరులకు పంపుతోంది.
మలైకా అరోరా మాల్దీవుల్లో సరదాగా గడుపుతున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాన్సూన్ ట్రిప్ లో అక్కడి వాతావరణం, ఆహారం, దుస్తులు వగైరా వగైరా విషయాలను తాను అనుభవించిన ఆనందాన్ని ఈ ఫోటోలు ఆవిష్కరిస్తున్నాయి. 'సాల్టీ అండ్ బ్లూ' అనే సింపుల్ క్యాప్షన్ ని కూడా ఈ ఫోటోలకు ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఫోటోగ్రాఫ్స్ లో మలైకా స్విమ్ సూట్ ధరించి ఈతకొలనులో స్వేచ్ఛగా కనిపించింది. అలాగే తనకు నచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తోంది. ఇన్ఫినిటీ పూల్ లోపల పోజులు సహా పూల్ డెక్‌పై ఉన్నప్పుడు.. తేలికగా ఉండే తెల్లటి వస్త్రాన్ని ధరించి, తాజా పండ్ల ప్లేట్‌ను ఆస్వాధిస్తూ కూడా కనిపించింది. దీనికి ముందు తన బాల్కనీ నుండి అందమైన సముద్ర దృశ్యాన్ని హైలైట్ చేస్తూ తీసిన ఫోటోగ్రాఫ్స్ కూడా వైరల్ అయ్యాయి. అందమైన, విశాలమైన సముద్రాన్ని చూస్తూ నలుపు పసుపు రంగులో ముద్రించిన బికినీని ధరించి కనిపించే చిత్రాన్ని కూడా అప్లోడ్ చేసింది.
ఇక మలైకా సంపాదన విషయానికి వస్తే.. ఇటీవల తన బ్రాండ్ ఎండార్స్మెంట్ విధుల్లో బిజీగా కనిపిస్తోంది. అయితే సినిమాలు పూర్తిగా తగ్గాయి. దీంతో రియాలిటీ షోల జడ్జిగాను బిజీ అయింది. అర్జున్ కపూర్‌తో ఇప్పటికే వచ్చిన బ్రేకప్‌పై పుకార్ల గురించి మలైకా అధికారికంగా ధృవీకరించలేదు. గత వారం ఒక ఫ్యాషన్ షోలో ఇద్దరూ ముందు వరుసలో విడివిడిగా కూర్చొని ఒకరినొకరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు తప్ప చాలా కాలంగా ఇద్దరూ కలిసి కనిపించలేదు. దీంతో రెడ్డిటర్లు బ్రేకప్ గురించి ప్రచారం సాగిస్తున్నారు.