గ్రేట్ మలైకా...మా మనసు గెలిచావ్!
దాన్ని గమనించిన మలైకా అతన్ని స్వాగతించి దగ్గరకు తీసుకుంది. ఆ సమయంలో ఆ యువకుడు మలైకా నడుం మీద సపోర్ట్ కోసం చేయివేసాడు.
By: Tupaki Desk | 19 Dec 2023 6:41 AM GMTహీరోయిన్లు అంటే తెరపై అందంగా కనిపించడమే కాదు..అంతకు మించి గొప్ప మనసు ఉంటుందని ఎంత మందికి తెలుసు? అవును ఈ సన్నివేశం చూసిన తర్వాత తప్పకుండా అంతా ఈమాటే అంటారు. ఐటం భామగా పాపులర్ అయిన మలైకా అరోరా మనసు ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలదా? హీరోయిన్లు అంటే ముఖానికి మ్యాకప్ వేసుకుని తిరిగే వాళ్లే కాదు...ఇలా సమయం వచ్చినప్పుడు మంచి హృదయాన్ని చాటుకుంటారని ప్రూవ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే మలైకా అలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంది.
ఆమెని చూసిన ఓ చూసిన ఓ ఫిజికల్ ఛాలెజెండ్ పర్సన్ ఆమెతో సెల్పీ దిగాలని ఆశపడ్డాడు.దీంతో అటు గా వస్తున్న మలైకా దగ్గరగా తనకు దేవుడిచ్చిన బలంతోనూ అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్లాడు. దాన్ని గమనించిన మలైకా అతన్ని స్వాగతించి దగ్గరకు తీసుకుంది. ఆ సమయంలో ఆ యువకుడు మలైకా నడుం మీద సపోర్ట్ కోసం చేయివేసాడు. మలైకా ఇంచు కూడా కదల్లేదు. ఆ సమయంలోయువకుడి మీద కోపపడటం కానీ..చిరాకు పడడటం కానీ ఏదీ చేయలేదు. నవ్వుతూ అతనితో కలిసి కెమెరా వైపు చూసి ఫోజులిచ్చారు.
ఇది చూసిన నెటి జనులు మలైకా మనసు ఎంత గొప్పది? అంటూ పొగిడేస్తున్నారు. నిజమే ఆసన్నివేశం చూసిన తర్వాత మలైకా మీద అభిప్రాయం అంతా ఎంతో పాజిటివ్ గా మారిపోతుంది. గ్రేట్ మలైకా అనకుండా ఉండలేం. కొంతమంది అయితే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ చూసి దూరంగా జరుగుతారు. ఫోటోలు ఇచ్చినా డిస్టెన్స్ మెయింటెన్ చేస్తుంటారు. కానీ మలైకా ఆటైపు కాదు. దగ్గరకు తీసుకుని ప్రేమని చాటే ప్రయత్నం చేసింది. అలా ఫోటో దిగే సరికి ఆ యువకుడి కళ్లలో పట్టలేని ఆనందం కనిపించింది.
సరిగ్గా ఇదే క్వాలిటీ టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాధ్ కి ఉంది. ముంబైలో ఆయన్ని ఎవరు గుర్తించి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఈయనా ఎంతో సంతోషంగా చేయి అందిస్తాడు. తనమన అదే బేధం లేని దర్శకుడు. జిందగీలో జీవితాన్ని చాలా కూల్ గా..లైట్ గా తీసుకునే దర్శకుడీయన.