హీరోలకు మాత్రమేనా బహుమతులు?
మలయాళం హీరోయిన్ దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 5 Oct 2024 1:30 AM GMTమలయాళం హీరోయిన్ దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలు విజయం సాధిస్తే హీరోలకు మాత్రమే ఖరీదైన కార్లు బహుమతులగా అందిస్తారని, హీరోయిన్లను మాత్రం పట్టించుకోరని వ్యాఖ్యానించింది. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
`హీరోయిన్లను పెద్దగా గుర్తించరు. సినిమా ప్లాప్ అయితే అన్ లక్కీ అంటారు. ఆమె వల్లే సినిమా ప్లాప్ అయిందంటారు` అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆమెకి నెటి జనులు మద్దతు పలుకుతున్నారు. నిజమే కదా సినిమా హిట్ అయితే హీరోలకు, దర్శకులకు మాత్రం బహుమతులు అందించిన వైనం చూసాం.
కానీ హీరోయిన్లను గుర్తించి అలాంటివి అందించినట్లు ఎక్కడా లేదంటున్నారు. ఇలాంటి కానుకులు అందించడం ఎక్కువగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో కనినిపిస్తుంటుంది. సక్సెస్ ఇచ్చిన దర్శకులకు ఖరీదైన బహుమతులు అందించిన వైనం తెలిసిందే.
మాళవిక తొలుత మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటుపై కన్నడ..హిందీ, తమిళ సినిమాలు చేసింది. ఇటీవల రిలీజ్ అయిన `తంగలాన్` తో మాత్రం మంచి విజయం అందుకుంది. `రాజాసాబ్` సినిమాతో టాలీవుడ్ లోనూ అడుగు పెడుతుంది. తొలి సినిమాలోనే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది.