మాళవిక మోహనన్ గెలాక్సీ హొయలు
ఆమె చేతికి అందంగా మెరిసే వింటేజ్ రింగ్, చెవులకు ప్రత్యేకమైన హంగు తీసుకువచ్చే జంకి ఈలిగెంట్ లుక్‌ను పెంచాయి.
By: Tupaki Desk | 27 Nov 2024 5:01 PM GMTటాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మాళవిక మోహనన్ తన గ్లామర్‌తో నెట్టింట హీట్ పెంచేస్తోంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశయు. వింటేజ్ స్టైల్ డ్రెస్‌లో కనిపించిన మాళవిక మరింత ఆకర్షణీయంగా మెరిసింది. ఈ లుక్స్‌లో ఆమె హుందాతనాన్ని, హాట్‌నెస్‌ను మేళవించి ప్రెజెంట్ చేసింది.
తాజా ఫోటోల్లో ఆమె నలుపు, వింటేజ్ జాకెట్ కాంబినేషన్‌లో అదిరిపోయే లుక్స్ ఇచ్చింది. ఆమె చేతికి అందంగా మెరిసే వింటేజ్ రింగ్, చెవులకు ప్రత్యేకమైన హంగు తీసుకువచ్చే జంకి ఈలిగెంట్ లుక్‌ను పెంచాయి. మాళవిక తన ఎద అందాలను హైలైట్ చేస్తూ స్టైల్‌ని ప్రెజెంట్ చేసింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి స్పందనను పొందాయి. కామెంట్స్‌లో నెటిజన్లు ఆమె అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
మాళవిక మోహనన్ మొదట మలయాళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. ఆమె తొలి చిత్రమే తన కెరీర్‌కు మంచి శుభారంభం ఇచ్చింది. ఆ తరువాత ‘మారి 2’, ‘మాస్టర్’ వంటి సినిమాల్లో నటిస్తూ దక్షిణాది పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. కాగా ఆమె నటించిన ‘బియాండ్ ది క్లోక్స్’ అనే హిందీ సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం మాళవిక పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ప్రభాస్‌తో కలిసి ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే, కార్తీ సరసన సర్ధార్ 2లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లు ఆమె కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్తాయని అంచనా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక మోహనన్ తన గ్లామర్ ఫోటోషూట్లతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. ఇటీవలి కాలంలో ఆమె వింటేజ్ ఫోటోషూట్లు, ట్రెండీ లుక్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.