Begin typing your search above and press return to search.

'రాజాసాబ్‌' గురించి మాళవిక...!

రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Dec 2024 1:30 PM GMT
రాజాసాబ్‌ గురించి మాళవిక...!
X

రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ఇది వరల్డ్‌ బిగ్గెస్ట్‌ హర్రర్‌ సినిమా అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమాలో మంచి కామెడీ సైతం ఉంటుంది అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇది చిన్న సినిమా అనుకునే వారు షాక్ అయ్యే విధంగా సినిమాను దర్శకుడు మారుతి షూట్‌ చేస్తున్నారు అంటూ సినిమాపై అంచనాలు భారీగా పెంచే విధంగా నిర్మాత విశ్వ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

ఇక ఈ సినిమా గురించి హిందీ నిర్మాత భూషన్ కుమార్‌ మాట్లాడుతూ.. రాజాసాబ్‌ సినిమాలోని కొన్ని సీన్స్ ను చూశాను. వాటిని చూస్తే హ్యారీపోర్టర్‌ సినిమాలోని సన్నివేశాల స్థాయిలో ఉన్నాయి అనిపించింది అంటూ చేసిన వ్యాఖ్యలు అందరికి షాకింగ్‌గా ఉన్నాయి. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి రెండేళ్లు అవుతున్నా కల్కి సినిమా విడుదల తర్వాత మాత్రమే ప్రభాస్‌ డేట్లు ఇచ్చారని నిర్మాత చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే 2025 ఏప్రిల్‌ 10 అంటూ డేట్‌ను ప్రకటించడం జరిగింది. మరి షూటింగ్‌ ఎంత వరకు అయ్యింది అనేది మాత్రం మేకర్స్ నుంచి క్లారిటీ ఇవ్వడం లేదు.

ఎట్టకేలకు రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ గురించి క్లారిటీ వచ్చింది. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది అంటూ హీరోయిన్ మాళవిక మోహనన్‌ ఒక చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చింది. సినిమాలోని తన పోర్షన్ దాదాపుగా పూర్తి అయ్యిందని, త్వరలోనే మొత్తం షూటింగ్‌ పూర్తి అవుతుంది అంటూ ఆమె పేర్కొంది. మారుతి గారు ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా ఒక్క రోజు వృదా కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. రాజా సాబ్ సినిమా మొత్తం చాలా సరదాగా సాగుతుందని చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్‌ అప్డేట్‌ ను త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి పాట త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన టీజర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది. డిసెంబర్‌ చివరి వరకు సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రాజాసాబ్‌ సినిమాలో తమన్‌ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అంటూ మేకర్స్‌ చెబుతూ ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ పోషిస్తున్న పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.