రాజాసాబ్... హీరోయిన్‌కి సమాచారం లేదా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్‌లో గందరగోళం కనిపిస్తోంది.
By: Tupaki Desk | 25 Dec 2024 5:11 AM GMTప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్‌లో గందరగోళం కనిపిస్తోంది. 2025 ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు అని అంటున్నారు . పైగా ప్రభాస్‌కి అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అయిన అనుష్క మూవీ 'ఘాటీ'ని అదే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఈమధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు ఒక తేదీకి అనుకుని మరో తేదీకి వస్తేనే క్రేజ్ మరింతగా పెరుగుతుంది. అంతే కాకుండా సినిమా హైప్ పెరగడం, పబ్లిసిటీ ఎక్కువ కావడం మనం చూస్తూ ఉంటాం. అందుకే సినిమాను ఒక తేదీకి విడుదల చేయాలని భావించినా ఏదో ఒక కారణం చెప్పి ఆలస్యం చేయడం మనం చూస్తూ ఉంటాం. రాజాసాబ్ కారణం ఏదైనా ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశాలు లేవు అని అంటున్నారు గ్రాఫిక్స్ తో కూడుకున్న మూవీ కావడం వాళ్ళ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు . రాజాసాబ్ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్‌తో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో హీరోయిన్ మాళవిక చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.
'రాజాసాబ్' సినిమా విడుదల విషయంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దర్శకుడు మారుతి గారు సినిమాను అనుకున్న సమయంకు పూర్తి చేస్తారు, ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సినిమాలోని తన పాత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. అందుకే సినిమా అనుకున్న తేదీకి వస్తుందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తాజాగా టాలీవుడ్‌లో తన ఎంట్రీ ఏప్రిల్‌లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. తద్వారా రాజాసాబ్ సినిమా ఏప్రిల్ నెలలోనే ఉంటుంది అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇండస్ట్రీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల దాదాపు కన్ఫర్మ్. కొత్త విడుదల తేది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు. 2025లో రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కనుక ఏప్రిల్ కాకున్నా మే లేదా జూన్‌లో అయినా రాజాసాబ్ రావాల్సి ఉంది. ఇది దాదాపు అందరికీ క్లారిటీ ఉంది. కానీ హీరోయిన్‌కి ఈ విషయంలో సమాచారం లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం ఈమెకు తెలియదా అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్‌గా తాను నటిస్తున్న సినిమా విడుదల విషయంలో తనకే స్పష్టత లేదా అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరి మాళవిక సమాచారం లేకపోవడం వల్ల అలా చెప్పిందా లేదా సినిమా ఏప్రిల్ లోనే విడుదల అవుతుందా అనేది తెలియలిసి ఉంది .