Begin typing your search above and press return to search.

దెయ్యంలా న‌న్నెందుకు చూడాల‌నుకుంటున్నారు?

సినిమాలు చేసి స‌క్సెస్ అయితే ఫాలోయింగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో?

By:  Tupaki Desk   |   30 Sep 2024 12:30 AM GMT
దెయ్యంలా న‌న్నెందుకు చూడాల‌నుకుంటున్నారు?
X

ముంబై బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్ టాలీవుడ్ లో ఇంకా లాంచ్ అవ్వ‌లేదు. కానీ అమ్మ‌డు ఇన్ స్టా అభిమా నులు బాగా సుప‌రిచితురాలే. ఎప్ప‌టిక‌ప్పుడు సెగ‌లు పుట్టించే ఫోటోల‌తో కుర్రాళ్ల‌ని ఆక‌ర్షిస్తుంది. మ‌త్తెక్కిం చే భంగిమ‌ల‌తో క‌నిక‌ట్టు చేసేస్తుంది. టాలీవుడ్ లో డెబ్యూ కి ముందే సొగ‌స‌రి ఈ ర‌కంగా తెలుగింట ఫేమ‌స్ అయిపోతుంది. సినిమాలు చేసి స‌క్సెస్ అయితే ఫాలోయింగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో?


ఈ బ్యూటీ తొలుత మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటుపై క‌న్న‌డ‌..హిందీలోనూ సినిమాలు చేసింది. అయితే పేరొచ్చింది మాత్రం కోలీవుడ్ చిత్రాల‌తోనే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `పేట` లో ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత విజయ్ న‌టించిన `మాస్టర్` మూవీలో విభిన్న పాత్రలో క‌నిపించింది. కానీ రెండు సినిమాలు అమ్మ‌డికి అనుకున్నంత గుర్తిం పును తీసుకురాలేదు.

ఇటీవ‌ల రిలీజ్ అయిన `తంగ‌లాన్` తో మాత్రం మంచి విజ‌యం అందుకుంది. తాజాగా అమ్మ‌డు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చింది. ఇందులో భాగంగా హార‌ర్ మూవీ లో దెయ్యం పాత్ర ఎప్పుడు పోషిస్తారు? అందులో చూడాల‌ని ఆశ‌ప‌డుతున్నాం అని ఓ యూజ‌ర్ అడిగాడు.

`మ‌రీ అంత ప్ర‌త్యేకంగా అడుగుతున్నారు. మీరు న‌న్ను దెయ్యంలా ఎందుకు చూడాల‌నుకుంటున్నారు` అని బ‌ధులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ చాట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. అమ్మ‌డు న‌టిస్తోన్న రాజాసాబ్ వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అంత‌వ‌ర‌కూ వెయిటింగ్ త‌ప్ప‌దు.