Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ కోసం మాళవిక అందం అంతకు మించి..!

మలయాళం చిత్రం 'పట్టం పోల్' తో సినీ ఇండస్ట్రీలో మాళవిక మోహనన్‌ ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం దాటింది.

By:  Tupaki Desk   |   3 Sep 2024 5:24 AM GMT
బాలీవుడ్‌ కోసం మాళవిక అందం అంతకు మించి..!
X

మలయాళం చిత్రం 'పట్టం పోల్' తో సినీ ఇండస్ట్రీలో మాళవిక మోహనన్‌ ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం దాటింది. మలయాళ సినిమాతో కెరీర్‌ ఆరంభించినా ఈ అమ్మడు ఎక్కువగా తమిళ సినిమాలు చేసింది. అరవ డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు దక్కించుకుంది. కానీ ఈ పదేళ్ల కాలంలో తెలుగు లో మాత్రం నటించలేదు. ఎట్టకేలకు రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. ఆ సినిమా తర్వాత మాళవిక మోహనన్‌ వరుసగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక వైపు రాజా సాబ్ చేస్తూనే మరో వైపు హిందీ సినిమా 'యుద్ర' లో నటించింది.

సిద్దాంత్‌ చతుర్వేది హీరోగా రూపొందిన 'యుద్ర' సినిమా సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల యుద్ర మేకర్స్‌ ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఇప్పటి వరకు మాళవిక మోహన్‌ చేసిన సినిమాల్లో కొన్ని సినిమాల్లో స్కిన్‌ షో చేసిన విషయం తెల్సిందే. అయితే యుద్ర సినిమాలో అంతకు మించి అన్నట్లుగా స్కిన్‌ షో చేసినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ప్రస్తుతం నెట్టింట మాళవిక యుద్ర సినిమా అందాల స్టిల్స్‌ వైరల్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాల ఆరబోతతో మాళవిక యుద్ర సినిమాలో కనిపించబోతుందని తెగ ప్రచారం జరుగుతోంది.

కేవలం అందాల ఆరబోత మాత్రమే కాకుండా హీరో సిద్దాంత్‌ తో రొమాంటిక్‌ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాల్లో కూడా మాళవిక మోహనన్‌ నటించింది. ఆ సన్నివేశాలు సినిమా పై హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ఇప్పటి వరకు చేయని తరహా పాత్ర చేయడంతో పాటు, రొమాంటిక్ సన్నివేశాల విషయంలో కూడా హద్దు దాటినట్లుగా నటించిన మాళవిక మోహనన్‌ కి యుద్ర హిట్ అయితే కచ్చితంగా బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు ఇంకా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యుద్ర సినిమా లో అందాల ఆరబోత చేసిన మాళవిక మోహనన్‌ హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తే, ప్రభాస్ తో ఆమె నటిస్తున్న రాజాసాబ్‌ సినిమాకు ఉత్తర భారతంలో అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యుద్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ లోనూ అందాల ఆరబోత చేసి ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్థాయిలో అందాల ఆరబోత గతంలో ఎప్పుడు లేదని, కచ్చితంగా మాళవిక మోహనన్‌ హిందీలో తన అందంతో స్టార్స్ దృష్టిని ఆకర్షించి, భవిష్యత్తులో పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.