ఆ బ్యూటీ కి ప్రభాస్ ఇంటి భోజనం..రుచి ఎలా ఉందంటే?
డార్లింగ్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. అతని డే నాన్ వెజ్ తోనే మొదల వుతుంది
By: Tupaki Desk | 30 Sep 2024 5:12 AM GMTడార్లింగ్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. అతని డే నాన్ వెజ్ తోనే మొదల వుతుంది. లంచ్..డిన్నర్..బ్రేక్ ఫాస్ట్ ఏదైనా సరే ముక్క తప్పనిసరి. పుష్టిగా అన్నింటిని ఆరగించి ఆస్వాదిం చడం డార్లింగ్ ప్రత్యేకత. నోరు కట్టుకోవడం అంటే చాలా కష్టమైన పని. అంతేకాదు తనతో పాటు మిగతా వారి కడుపునింపడంలో అంతకు మించి ముందు ఉంటారు.
ఆయన సినిమా షూటింగ్ జరుగుతుంటే సెట్ లో డార్లింగ్ నాన్ వెజ్ భోజనం తప్పని సరిగా హీరోయిన్లు రుచి చూడాల్సిందే. ఇప్పటి వరకూ ఆయనతో పనిచేసిన హీరోయిన్లు అందరికీ తన ఇంటి భోజనం రుచి చూపించిన ఏకైక స్టార్. ఈ లిస్ట్ తీస్తే చాలా పెద్దదే ఉంటుంది. హీరోయిన్లతో పాటు దర్శకులు సైతం చాలా మంది ఉంటారు. ఆయన ఇంటి ఫుడ్ రుచి చుసిన వారంతా డార్లింగ్ గురించి ఎంతో గొప్పగా చెబుతుం టారు.
ఇలా భోజనాలు పెట్టడం అన్నది పెదనాన్న కృష్ణంరాజు నుంచి ప్రభాస్ కి అబ్బంది. తాజాగా మాళవికా మోహనన్ కూడా డార్లింగ్ ఇంట భోజనం గురించి ఓపెన్ అయింది. సోషల్మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోకి వచ్చిన అమ్మడిని చాలా ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ప్రత్యేకంగా తినాలకునే ఫుడ్ ఏమిటి ? అని ఓ నెటిజన్ అడగగా.. మాళవిక ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ..`
హైదరాబాద్‌లో నేను తిన్న అత్యంత రుచికరమైన ఆహారం ప్రభాస్ పంపే ఇంటి భోజనం’ అని ఆన్సర్ ఇచ్చింది. మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఏమిటి ? అని మరో నెటిజన్ ప్రశ్నించగా… `మా అమ్మ చేతి వంట. బ్రౌన్ రైస్, చేపల కూర, వేపుడు అంటే చాలా ఇష్టం` అని తెలిపింది. ప్రస్తుతం ఈ భామా రాజాసాబ్ లో ప్రభాస్ కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అమ్మడి తొలి తెలుగు సినిమా ఇదే