ప్రేమ మతం మారమని చెప్పిందా?
అప్పట్లోనే ఆమె తెలుగింట బాగా ఫేమస్ అయిన నటిగా గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా లవ్ జిహాద్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు
By: Tupaki Desk | 5 Dec 2023 12:30 PM GMTకోలీవుడ్ సీనియర్ నటి మాళవికా అవినాష్ సుపరిచితమే. 'కేజీఎఫ్' లో ఓ గెస్ట్ పాత్రలో నటించిన ఆమె ఆ సినిమాతో పాన్ ఇండియాలో గుర్తింపు దక్కించుకున్నారు. అలాగే మలయాళంలోనూ చాలా సినిమాల్లో నటించారు. 80 కాలం నుంచే ఆమె నటిగా కొనసాగుతున్నారు. ఇక మాళవిక తెలుగు ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా బాగా సుపరిచితమే. అప్పటి తమిళ సీరియల్స్ తెలుగు అనువాద రూపంలో మాళవిక పరిచమయ్యారు.
అప్పట్లోనే ఆమె తెలుగింట బాగా ఫేమస్ అయిన నటిగా గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా లవ్ జిహాద్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పుత్తూరు జిల్లా మహఙళౄ సదస్సు లో జరిగిన నారీ శక్తి సంఘం కార్యక్ర మంలో ఆమె అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నేటి యువత ప్రేమకు అర్దం తెలుసుకోవాలి. నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా స్వీకరిస్తుంది. అంతేకాని నీ మతం మారమని కోరదు.
యువత రకరకాల కోరికలు..ప్రలోబాలకు లొంగి లవ్ జిహాద్ వలలో పడి మతాన్ని వీడుతున్నారు. మీ మతాన్ని వదిలే మరో మతంలో చేరే ముందు భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఆలోచించండి. హిందు మతంలో ఏకభార్యత్వం అమలులో ఉంది. ఇక్కడ భార్య భర్తలకు సమాన హక్కులుంటాయి. ముస్లిం మతంలో బహుభార్యత్వం ఆచారం ఉంది. విదేశీయుడుని పెళ్లి చేసుకుంటే మహిళ తన హక్కుల్ని కోల్పోవాల్సి ఉంటుంది. బహుభారత్వం కింద ఒంటరిగా జీవించాలి.
ఇస్లాంలోకి మారి ప్రేమిస్తే అది ఎలాంటి ప్రేమ? ఆ ప్రేమ ఏంటో ప్రతీ యువత అర్ధం చేసుకోవాలి' అని అన్నారు. పదేళ్ల లోపు పిల్లలు..వృద్ధులు మాత్రమే శబరిమలకు వెళ్లొచ్చు. తక్కువ వయసున్న మహిళలకు ఆలయ ప్రవేశం లేదు. హిందు ధర్మంలో ఆచారాలపై మాట్లాడేవారికి ముస్లీం మహిళలకు ఏ మసీదులో ప్రవేశానికి అనుమతి ఉందని ప్రశ్నించారు. హిందూ యువత మతం మారితే.. పూజలు.. ఆలయ ప్రవేశం కోల్పోవాల్సి ఉంటుంది' అన్ని అన్నారు.