Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : జిమ్ లో అందాల మాళవిక

తాజాగా మరో ఫోటోతో మాళవిక మోహనన్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈసారి జిమ్‌ లో వర్కౌట్స్ చేయడం మానేసి సెల్ఫీ తీసుకుంది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:41 AM GMT
పిక్ టాక్ : జిమ్ లో అందాల మాళవిక
X

పదేళ్ల క్రితం మలయాళ చిత్రం పట్టం పోలె సినిమా తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌. ఈ అమ్మడు కెరీర్‌ లో చాలా స్లోగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ పదేళ్లలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే. అయితే సోషల్ మీడియాలో మాత్రం మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.


తెలుగు లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకున్నా కూడా డబ్బింగ్‌ సినిమాలు మరియు అందాల ఫోటో షూట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రెగ్యులర్ గా ఈ అమ్మడి అందాల ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి.

తాజాగా మరో ఫోటోతో మాళవిక మోహనన్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈసారి జిమ్‌ లో వర్కౌట్స్ చేయడం మానేసి సెల్ఫీ తీసుకుంది. నడుము నాభి అందం చూపిస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ సెల్ఫీ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో తంగలాన్ సినిమాలో నటిస్తోంది. మరో వైపు హిందీలో ఒక సినిమా ను చేస్తుంది. ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మారుతి ప్రభాస్ సినిమా లో కూడా మాళవిక మోహనన్‌ ఒక హీరోయిన్ గా కనిపించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.