Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో ఇప్పటికైనా లక్కు మారుతుందా?

దీంతో మాళవిక మోహనన్ ఆశలన్నీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాలో కాస్తా గ్లామర్ టచ్ ఉన్న పాత్రలోనే మాళవిక మోహనన్ లీడ్ రోల్ లో నటిస్తోంది.

By:  Tupaki Desk   |   18 Aug 2024 1:30 PM GMT
ప్రభాస్ తో ఇప్పటికైనా లక్కు మారుతుందా?
X

మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్ కూతురు అని చాలా మందికి తెలియదు. అంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అమ్మడు సొంతంగానే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేసింది. ఈ బ్యూటీ మొదటి సినిమా మాతృభాష మలయాళంలోనే చేసింది. పట్టం పోలె సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యింది. తరువాత వరుస అవకాశాలు అందుకుంది. తమిళ్, కన్నడ భాషలలోకి కూడా మాళవిక తొందరగానే ఎంట్రీ ఇచ్చింది.

తమిళంలో మాస్టర్ మూవీలో విజయ్ కి జోడీగా నటించింది, అలాగే మారన్ మూవీలో ధనుష్ తో జతకట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా పెట్టా సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన కమర్షియల్ బ్రేక్ రాలేదు. ఇన్ స్టాగ్రామ్ లో మాళవిక మోహనన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలతో దేశ వ్యాప్తంగా మాళవిక మోహనన్ పాపులర్ అయ్యింది.

బియాండ్ ది క్లౌడ్స్ అనే సినిమాతో మాళవిక మోహనన్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆమెకి సక్సెస్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా తంగలాన్ సినిమాతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మాంత్రికురాలిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించింది. ఆమె పాత్రకి మంచి గుర్తింపు వస్తోంది. పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి.

తెలుగులో కూడా ఈ సినిమా మెల్లగా పిక్ అప్ అవుతోంది. అయితే తంగలాన్ సినిమాతో నటిగా ఆమెకి ఫేమ్ వచ్చిన కమర్షియల్ హీరోయిన్ అవ్వాలనే కోరిక మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. ఎందుకంటే తంగలాన్ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేయలేదు. దీంతో మాళవిక మోహనన్ ఆశలన్నీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాలో కాస్తా గ్లామర్ టచ్ ఉన్న పాత్రలోనే మాళవిక మోహనన్ లీడ్ రోల్ లో నటిస్తోంది.

ప్రభాస్ తో ఆమెకి మంచి డ్యూయెట్స్ కూడా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ది రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. అలాగే ప్రభాస్ ఇమేజ్ బట్టి చూసుకుంటే ది రాజాసాబ్ సినిమాకి దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మూవీలో మంచి గ్లామర్ ఎలివేషన్ ఉంటే కచ్చితంగా మాళవిక మోహనన్ దేశ వ్యాప్తంగా అందరిని ఇంప్రెస్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్ గా అవకాశాలు పెరుగుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.