Begin typing your search above and press return to search.

ది రాజాసాబ్ సెట్ లో హీరోయిన్ సెలబ్రేషన్స్

ఈ గ్లింప్స్ లో డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్ లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.

By:  Tupaki Desk   |   4 Aug 2024 8:07 AM GMT
ది రాజాసాబ్  సెట్ లో హీరోయిన్ సెలబ్రేషన్స్
X

ఇండియన్ నెంబర్ వన్ హీరో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా ది రాజాసాబ్. కల్కి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో నెక్స్ట్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా కూడా ది రాజాసాబ్ సినిమాపైనే ఉంది. ఈ సినిమాకి సంబందించి ఎలాంటి అప్డేట్స్ సోషల్ మీడియాలో వచ్చిన వాటిపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ది రాజాసాబ్ చిత్రం నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్ లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.


దీంతో గ్లింప్స్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. కచ్చితంగా ది రాజాసాబ్ సినిమా డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రొమాంటిక్ హర్రర్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా మూవీ రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.


మాళవిక మోహనన్ ది రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం మొదలైన షూటింగ్ షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొంది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ లోనే మాళవిక మోహనన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. వీటికి సంబందించిన ఫోటోలని అఫీషియల్ గా సోషల్ మీడియాలో పంచుకున్నారు. మాళవిక మోహనన్ షూటింగ్ సెట్ లో అడుగుపెట్టిందని, ఆమెకి గ్రాండ్ గా స్వాగతం చెబుతున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పేర్కొంది.


అలాగే మాళవిక మోహనన్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా షూటింగ్ సెట్ లో చేసినట్లు తెలిపింది. ఈ రోజు ఇది క్యూటెస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఇంటర్ నెట్ అని ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో మారుతి మాళవిక మోహనన్ కి కేక్ తినిపించి విషెస్ చేశారు. మాళవిక మారుతితో సెల్ఫీ తీసుకుంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్, మాళవిక మోహనన్ మధ్య మంచి రొమాంటిక్ సీక్వెన్స్ లు ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది.


ఈ బ్యూటీ మాత్రమే కాకుండా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సంజయ్ దత్ ప్రభాస్ తాత క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జోనర్ లో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా అతనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.