Begin typing your search above and press return to search.

ఆలూ లేదు, సూలూ లేదు.. యానిమల్ సీక్వెల్‌ లో ఆమె!

తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమా ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు సౌత్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ విపరీతమైన వసూళ్లు నమోదు చేస్తోంది.

By:  Tupaki Desk   |   15 Dec 2023 6:16 AM GMT
ఆలూ లేదు, సూలూ లేదు.. యానిమల్ సీక్వెల్‌ లో ఆమె!
X

తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమా ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు సౌత్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ విపరీతమైన వసూళ్లు నమోదు చేస్తోంది. ఈ వీకెండ్‌ కి యానిమల్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.


యానిమల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు సందీప్‌ వంగ సీక్వెల్‌ చేసే ఉద్దేశ్యం ఉన్నట్లుగా ప్రకటించాడు. యానిమల్‌ హిట్ అయితే కచ్చితంగా సీక్వెల్‌ వస్తుందని అప్పుడు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు యానిమల్‌ సూపర్ హిట్ అయ్యి వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అవ్వబోతున్న నేపథ్యంలో సీక్వెల్‌ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కథలు అల్లేసుకుంటున్నారు.

ముఖ్యంగా యానిమల్‌ సినిమా కోసం ఇప్పటికే సందీప్‌ వంగ స్టోరీ లైన్ ను అనుకున్నాడు. ఆ స్టోరీ లో అత్యంత కీలకమైన లేడీ విలన్ ఉంటుంది. ఆ లేడీ విలన్ పాత్రకు గాను ఇప్పటికే హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ ను సంప్రదించడం, ఆమె ఓకే చెప్పడం జరిగిందని కొన్ని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు.

సందీప్ వంగ తదుపరి సినిమా స్పిరిట్‌ వచ్చే ఏడాది చివర్లో మొదలు అయ్యే అవకాశం ఉంది. స్పిరిట్‌ రావడానికే ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ తో ఇప్పటికే ప్రకటించిన సినిమాను కూడా సందీప్ వంగ చేయాల్సి ఉంది. స్పిరిట్ మరియు బన్నీ సినిమాలు పూర్తి చేయడానికి సందీప్ వంగ ఎంత సమయం తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ రెండు సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి కనీసం మూడు నాలుగు ఏళ్ల సమయం ఈజీగా పట్టడం ఖాయం. ఇలాంటి సమయంలో యానిమల్ సీక్వెల్‌ గురించి ఆయన ఆలోచించడం, కథ ను అనుకుని హీరోయిన్‌ ను ఫిక్స్ చేయడం అనేది పూర్తిగా అవాస్తవం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలూ లేదు సూలూ లేదు అన్న సామెత ప్రస్తుతం ఈ పుకార్ల విషయంలో సరిగ్గా సెట్‌ అవుతుందని కొందరు అంటున్నారు.