మేడం 'చాలా బాగుంది' రీ ఎంట్రీకి ప్రయత్నాలు..!
జిమ్ లో రెగ్యులర్ గా వర్కౌట్ లు చేయడంతో పాటు.. డైటింగ్ ఇతర మార్గాల ద్వారా మాళవిక సన్నగా నాజూకుగా మారింది.
By: Tupaki Desk | 6 Nov 2023 7:15 AM GMTతెలుగు ప్రేక్షకులకు 'చాలా బాగుంది' హీరోయిన్ మాళవిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులు కూడా ఈమెను బుల్లి తెరపై చూస్తూనే ఉంటారు. విలక్షణమైన నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మాళవిక. ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని సౌత్ భాష ల్లో కూడా నటించి మెప్పించింది.
1999 లో సినీ రంగ ప్రవేశం చేసిన మాళవిక కొన్ని కారణాల వల్ల వివాదాస్పద నటి అన్నట్టుగా ముద్ర పడిపోయింది. దాంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. దాంతో 2007 సంవత్సరం లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితం మొదలు పెట్టింది. పెళ్లి తర్వాత మాళవిక గుర్తు పట్టలేనంత బరువు పెరిగి పోయిన విషయం తెల్సిందే.
ఆ మధ్య ఒక తెలుగు టాక్ షో కు ఆమె వస్తే చాలా మంది జనాలు ఆమెను గుర్తించలేదు. అంతగా బరువు పెరిగిన మాళవిక తన మునుపటి రూపం కు వచ్చేసింది. జిమ్ లో రెగ్యులర్ గా వర్కౌట్ లు చేయడంతో పాటు.. డైటింగ్ ఇతర మార్గాల ద్వారా మాళవిక సన్నగా నాజూకుగా మారింది. దాంతో ఇప్పుడు మళ్లీ ఈమె బుల్లి తెరపై సందడి చేస్తోంది.
తమిళ్ టీవీ ఛానల్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తూ చాలా బాగుంది అనిపించుకుంటున్న మాళవిక త్వరలోనే వెండి తెరపై రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ తో పాటు ఏ భాష లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చినా కూడా చేసేందుకు రెడీ అన్నట్లుగా మాళవిక ఉందట.
ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సొంతం చేసుకుని, హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంతగా అయితే సంపాదించారో అంత ఇప్పుడు సంపాదిస్తున్నారు. కనుక మాళవిక గట్టిగా ప్రయత్నాలు చేస్తే ఆ రేంజ్ లో సంపాదించే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.