మాజీ భార్య ఫిర్యాదుతో ప్రముఖ నటుడు అరెస్ట్
ప్రముఖ మలయాళ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ప్లాట్ లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By: Tupaki Desk | 14 Oct 2024 10:19 AM GMTప్రముఖ మలయాళ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ప్లాట్ లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ భార్య అమృత సురేష్ ఫిర్యాదు చేయడంతోనే అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ విషయంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలే జస్టిస్ హేమ కమిటీ నివేదికతో వివాదంలో పడిన ఇండస్ట్రీతో బాల కేసుతో మరోసారి సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో తమ్ పరువు తీసేలా బాలా ప్రవర్తిస్తున్నాడని అమృత ఫిర్యాదు చేసింది. తనకుమార్తెను సైతం వేధిస్తున్నాడని ఆమెతోనూ కేసు పెట్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలా తోపాటు మేనేజర్, ఓ యూట్యూబ్ ఛానెల్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన ఆరోపణతో జువైనల్ యాక్ట్ కింద కూడా నాన్ బెయిల్ బుల్ కేసు నమోదైంది.
అంతకు ముందు బాల వేధిస్తున్నాడని అమృత రెండు..మూడు సార్లు కేసు పెట్టింది. ఇప్పుడు విడాకుల నిబంధన మీరి తమని వేధిస్తున్నాడని కొత్త ఆరోపణ తెరపైకి తెచ్చింది. అయితే కుమార్తె ఆరోపణలపై స్పందించిన బాలా ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు.
తనకు హాని చేయాలని చిన్నప్పటి నుంచి తన తండ్రి ప్రయత్నిస్తున్నాడన్న ఆమె ఆరోపణలను కొట్టిపడేసిన బాలా.. తనను ఇప్పటికైనా తండ్రిగా గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇది తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొన్నాడు. అయితే, ఈ ఆరోపణలతో అంగీకరించేది లేదని, అలాగని తనతో వాదించే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశాడు. కుమార్తెతో వాదించే తండ్రి అసలు మనిషే కాదని చెప్పుకొచ్చాడు.