మాజీ భార్య కేసు..బెయిల్ పై బయటకొచ్చి మూడో పెళ్లి!
' కోకిల నా మావయ్య కుమార్తె. నన్ను పె ళ్లి చేసుకోవాలని ఆమెకి కోరిక ఉండేది. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. నా కష్ట సమయంలో నాకు తోడుగా ఉంది.
By: Tupaki Desk | 22 Oct 2024 9:30 PM GMTమలయాళ నటుడు బాల మాజీ భార్య ఇటీవల అతడ్ని కేసు పెట్టి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. సరిగ్గా పది రోజుల క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. తనతో పాటు కుమార్తెను సైతం వేధించాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో బాలకి 24 గంటల్లోనే బెయిల్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన తాజాగా మూడవ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు. మూడవ పెళ్లి చేసుకుని భార్యతో కలిసి కేరళలోని కలూర్ పావకులం ఆలయానికి వచ్చాడు.
తమిళనాడు కు చెందిన తన బంధువునే వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక రెండు కుటుంబాల మధ్యనే సింపుల్ గా జరిగింది. అతిధిలు, స్నేహితులు, సన్నిహితులు ఎవరూ లేరు. ఈ విషయంపై బాల ఓపెన్ అయ్యాడు. ' కోకిల నా మావయ్య కుమార్తె. నన్ను పె ళ్లి చేసుకోవాలని ఆమెకి కోరిక ఉండేది. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. నా కష్ట సమయంలో నాకు తోడుగా ఉంది. నేను అన్ని రకాలుగా కంబ్యాక్ అవ్వడానికి కారణం తనే.
అలాంటి వ్యక్తితో జీవితం బాగుంటుందని పెళ్లి చేసుకున్నా' అని తెలిపాడు. బాలకి ఇప్పటికే రెండుసార్లు పెళ్లి జరిగంది. ఆయన మొదటి భార్య గాయని అమృత. 2010లో వారి వివాహం జరిగింది. ఈ జోడికి అవంతిక అనే కుమార్తె కూడా ఉంది. కానీ మనస్పర్దల కారణంగా 2019లో విడిపోయారు. ఆ తర్వాత డాక్టర్ ఎలిజబెత్ ఉదయ్ ని 2021 లో రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అ బంధం ఎంతో కాలం నివలవేలు. 2023లో విడిపోయారు.
ఇప్పుడు ఆయనపై కేసు పెట్టింది మొదటి భార్య, కుమార్తె అవంతిక. ఇప్పుడీ కేసు కోర్టులో ఉంది. చట్టపరంగా విడిపోయినా వేధిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో తాజా కేసు ఫైల్ అయింది. ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైనట్లు వార్తలొచ్చాయి. కానీ అతడికి 24 గంటల్లోనే బెయిల్ వచ్చింది.