కూతురు అంటూనే అత్యా*చారం.. దర్శకుడిపై నటి ఆరోపణ!
మలయాళ చిత్రసీమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 5 Sep 2024 3:30 PM GMTమలయాళ చిత్రసీమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది మాలీవుడ్‌లో #MeToo వేవ్‌గా రూపాంతరం చెందింది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఒకదాని తర్వాత మరొకటి షాకింగ్ రహస్యాలు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఇటీవల పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల ప్రహసనం గురించి ఓపెనవ్వడంతో దీనిపై విచారణ సాగుతోంది. మాలీవుడ్ నటి ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకనిర్మాతపై ఫిర్యాదు చేసారు. నన్ను కుమార్తె అని పిలుస్తూనే, అత్యాచారం చేశాడని.. 18 ఏళ్ల వయసులో తనను సె* బానిసగా ఏమార్చాడని, ఏడాది పాటు ఈ తంతు నిర్విరామంగా సాగిందని పేర్కొంది.
జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 18 ఏళ్ళ వయసులో తన కాలేజీలోని థియేటర్ గ్రూప్ ద్వారా షోబిజ్‌లో కొందరితో సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ సమయంలో తమిళ దర్శకుడు తనను ఒక సినిమాలో నటింపజేయమని తన తండ్రిని సంప్రదించాడని చెప్పింది. మొదటి సమావేశంలోనే సదరు దర్శకుడితో తనకు సుఖంగా అనిపించలేదని, అయితే ఆ పాత్రలో తనను నటింపజేయడానికి అతడు చాలా డబ్బు ఖర్చు చేసినందున సినిమా కోసం కలిసి పనిచేయడాన్ని తాను బాధ్యతగా భావించానని వెల్లడించింది. అయితే తాను సెట్స్‌పైకి వెళ్ళిన తర్వాత దర్శకుడు ఆమెకు `కోపంతో నిశ్శబ్ద చికిత్స` ఇచ్చాడు. ఇది సౌమ్యను భయపెట్టింది. దానివల్ల తాను ఏదీ బయటకు మాట్లాడలేకపోయానని తెలిపింది.
సదరు దర్శకుడు భార్య తనను ఇంటికి పిలిచి ఆహారం, మిల్క్‌షేక్‌లతో విలాసవంతంగా ఆతిథ్యం ఇస్తారని సౌమ్య తెలిపారు. ఒక రోజు అతడి భార్య లేనప్పుడు, డాటర్ అని పిలుస్తూనే నన్ను ముద్దు పెట్టుకున్నాడు. నేను పూర్తిగా స్తంభించిపోయాను. నా స్నేహితులకు చెప్పడానికి చాలా తపన పడ్డాను.. కానీ ఆ పని చేయలేకపోయాను. నేను ఏదో చేశానని భావించి సిగ్గుపడ్డాను. తప్పు.. నేను ఈ వ్యక్తితో మంచిగా ఉండాల్సిన బాధ్యత కలిగి ఉన్నానని భావించినట్టు గుర్తుచేసుకుంది. అయితే ఆ చిత్రం రిహార్సల్స్ కోసం అతడి ఇంటికి వెళ్లడం కొనసాగించానని నటి తెలిపింది. క్రమక్రమంగా అతడు నా శరీరాన్ని పూర్తిగా తన ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నాడు. అతను నాపై బలాత్కారం చేశాడు. అత్యాచారం చేశాడు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఇది దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది! అని తెలిపింది. నా ఈ పరిస్థితిలో మొత్తం పాత్ర దర్శకుడిదే. సెక్స్ బానిసగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగించాడు అని వెల్లడించింది.
దర్శకుడు తనను కుమార్తె అని పిలుస్తాడని, తనకు బిడ్డ కూడా కావాలని చెప్పాడని వెల్లడించింది. అతడు నా మెదడులో చెదపురుగులా మారాడు.. ఈ అవమానం నుండి కోలుకోవడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది! అని చెప్పింది.నటి తన కష్టాలను పోలీసులతో షేర్ చేసుకున్నానని, తన భద్రతను దృష్టిలో ఉంచుకుని దర్శకుడి పేరును బహిరంగపరచడం ఇష్టం లేదని పేర్కొంది. కేవలం తాను విచారణ అధికారులకు మాత్రమే ఆ దర్శకుడి పేరును చెబుతానని కూడా వెల్లడించింది.