Begin typing your search above and press return to search.

ఆ 'ఈగ' మ‌న ఈగ కాదుగా!

' ల‌వ్ లీ ఈగ' టైటిల్ తో ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. మ‌ల‌యాళంతో పాటు త‌మిళ్, తెలుగు , హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   12 March 2025 6:46 PM IST
ఆ ఈగ మ‌న ఈగ కాదుగా!
X

'ఈగ' అన‌గానే నాని-స‌మంత‌-రాజ‌మౌళి గుర్తొస్తారు. ఈ సినిమా అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. టెక్నిక‌ల్ గా జ‌క్క‌న్న స‌త్తా ప్ర‌పంచానికి చాటిన చిత్ర‌మిది. ప‌లు అంతర్జాతీయ అవార్డుల‌తోనూ ఈగ మోత‌మ్రోగించింది. రాజ‌మౌళి ఇంత గొప్ప క్రియేట‌రా? అని ఆనాడే విదేశీ దిగ్గ‌జాల‌తో ప్ర‌శంస‌లం దుకున్నారు. క‌మ‌ర్శియ‌ల్ గానూ ఈ సినిమా మంచి లాభాలు సాధించింది.

ఓ ఈగ‌తో అద్భుత‌మైన ఎమోష‌న్ పండిచొచ్చు? అని తొలిసారి రుజువు చేసిన ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుంద‌ని చాలా విన్న‌పాలు వెళ్లాయి. ఇప్ప‌టికీ కూడా 'ఈగ' సీక్వెల్ చేయాల‌ని ఆశించే వారెంతో మంది. కానీ రాజమౌళి ఆఛాన్స్ తీసుకోవ‌డం లేదు. అయితేనేం నేను ఉన్నానంటూ మ‌రో ఈగ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అంత‌టి సాహ‌సం చేసింది ఈసారి మాలీవుడ్ డైరెక్ట‌ర్ దినేష్ క‌రుణాక‌ర‌న్.

' ల‌వ్ లీ ఈగ' టైటిల్ తో ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. మ‌ల‌యాళంతో పాటు త‌మిళ్, తెలుగు , హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ్ అయింది. ఈగ‌తో ఓయువ‌కుడి స్నేహం? ఆ స్నేహం ఎలా సాగింది? ఈగ‌-మ‌నిషి మ‌ధ్య ఎమోష‌న్ అద్బుతంగా క్యారీ అయింద‌ని టీజ‌ర్ లోనే అర్ద‌మ‌వుతుంది. స్నేహితుడిని స‌మ‌స్య‌ల్ని ఈగ ఎలా తీర్చింది? అన్న‌ది పాయింట్ గా తెలుస్తుంది.

సినిమాలో విఎఫ్ ఎక్స్ బాగుంది. మ‌న రాజ‌మౌళి ఈగ డిజైన్ నే ఈ 'ఈగ' కూడా పోలి ఉంది. అచ్చంగా మ‌న తెలుగు ఈగ‌ని చూస్తున్న‌ట్టే ఉంది. టీజ‌ర్ తెలుగు ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయింది. అప్ప‌టి 'ఈగ' కూడా తెలుగులో చిన్న పిల్ల‌లు స‌హా పెద్ద‌వారికి బాగా క‌నెక్ట్ అయింది. మ‌రి మ‌ల‌యాళం ఈగ ఎలా ఉంటుం ద‌న్న‌ది చూడాలి.