సక్సెస్ కావడానికి డిజార్డర్ కూడా ఓ కారణమా?
తాజాగా ఇదే డిజార్డర్ నాకూ ఉందంటూ మరో మలయాళనటుడు షైన్ టాక్ చాకో ఓపెన్ అయ్యాడు.
By: Tupaki Desk | 6 Aug 2024 4:52 PM GMTఈ మధ్య కాలంలో సెలబ్రిటీలంతా తమ ఒంట్లో అనారోగ్యాల్ని సైతం దాచుకోకుండా చెప్పేస్తోన్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ లాంటి మహామ్మారి బారిన పడితేనే సెలబ్రిటీలు ఓపెన్ అయ్యేవారు. చిన్న చిన్న జబ్బులు..డిజార్డల్ని మాత్రం దాచి పెట్టేవారు. అలా చెబితే ఇండస్ట్రీలో ఎక్కడ అవకాశాలకు దూరమవు తామనే భయంతో ఓపెన్ అయ్యేవారు కాదు. కానీ నేడు సినారే మరింది. ఎంత ఓపెన్ గా ఉంటే అభిమానులు అంతగా ఆరాధిస్తున్నారు.
అలాంటి సెలబ్రిటీలకు ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. వాళ్లకున్న సమస్యలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్నారు. సమంత మయోసైటిస్ గురించి చెప్పిన తర్వాత పలువురు హీరోయిన్లు కూడా తమనకున్న అనారోగ్యాల గురించి ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే మలయాళ నటుడు ఫహాద్ ఫాజల్ కూడా ఏడీహెచ్ డీ డిజార్డర్ ఉందని అన్నాడు. తాజాగా ఇదే డిజార్డర్ నాకూ ఉందంటూ మరో మలయాళనటుడు షైన్ టాక్ చాకో ఓపెన్ అయ్యాడు.
చాలా కాలంగా హైపర్ యాక్టివిటీతో డిజార్డర్ తో బాధపడుతున్నట్లు తెలిపాడు. అయితే ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఇతరులు కంటే భిన్నంగా కనిపించడానికి ఇష్టపడతారని అది తనకి ఎంతో కలిసొస్తుందన్నాడు. బయట వ్యక్తులు దీన్ని ఓ మానసిక రుగ్మతగా భావిస్తారు. కానీ నాకు మాత్ర అదెంతో స్పెషల్ గా అని పిస్తుంది. నలుగురు ఉన్నట్లు ఉండను. అలాంటి ఆలోచనలు రావు. రొటీన్‌కి భిన్నంగా చేయాలనిపిస్తుంది.
ఈ డిజార్డర్ ని ఓ క్వాలిటీగా భావిస్తున్నా' అని అన్నాడు. షైన్ టామ్ చాకో నాని హీరోగా నటించిన 'దసరా' సినిమాతో విలన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నటుడిగా షైన్ టామ్ కి మంచి పేరుంది. వైవిథ్యమైన నటుడీయన.