Begin typing your search above and press return to search.

అడ్డాలకు హ్యాండ్ ఇచ్చిన ఆ నటుడు ఎవరంటే..?

చివరి నిమిషంలో ఆ రోల్ ఆయన చేయాల్సి వచ్చిందట. కానీ, ఆ పాత్రకు ఆయన బాగా సూట్ అయినట్లు ట్రైలర్ చేస్తే అర్థమౌతుంది.

By:  Tupaki Desk   |   12 Sept 2023 1:04 PM IST
అడ్డాలకు హ్యాండ్ ఇచ్చిన ఆ నటుడు ఎవరంటే..?
X

బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వారిలో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. మొదట్లో ఫ్యామిలీ కథలతో ఆకట్టుకున్న ఆయన ఈ సారి మాస్ యాంగిల్ ఎంచుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం పెద కాపు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ మూవీలో ఆయన తొలిసారి నటించారు. అది కూడా ఓ విలన్ పాత్రలో నటించడం విశేషం.

ఈ మధ్యకాలంలో చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో లేదంటే, వేరే సినిమాల్లో నటించడం చాలా కామన్ అయిపోయింది. ఇదే ఫార్ములాని శ్రీకాంత్ అడ్డాల కూడా ఫాలో అయ్యారు అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన నిజానికి ఆ పాత్రకు వేరే వ్యక్తిని తీసుకోవాలని అనుకున్నారట. ఆ వ్యక్తి సడెన్ గా ఈ ప్రాజెక్ట్ లో భాగం కాలేకపోయేసరికి, ఆ పాత్రను తాను చేసినట్లు ఆయన చెప్పారు.

అలా చెప్పినప్పటి నుంచి ఆ పాత్రను మిస్ చేసుకున్నది ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో, ఆయన ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ మళయాళ నటుడు సౌబిన్ షాహిర్ ను మొదట పెదకాపు మూవీలో విలన్ గా ఎంపిక చేశారట.

మొదటి రోజు షూటింగ్ సమయానికి ఆయన రాలేదట. దీంతో, ఆ పాత్రను శ్రీకాంత్ అడ్డాలను చేయమని అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్ సూచింశాడట. దీంతో, చివరి నిమిషంలో ఆ రోల్ ఆయన చేయాల్సి వచ్చిందట. కానీ, ఆ పాత్రకు ఆయన బాగా సూట్ అయినట్లు ట్రైలర్ చేస్తే అర్థమౌతుంది.

ఇక, ఈ పెదకాపు మూవీ ని ద్వారకా క్రియేషన్స్‌ తెరకెక్కిస్తోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల చివరగా, వెంకటేష్ తో కలిసి నారప్ప తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత వస్తున్న సినిమా ఇదే. కాగా, మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.