Begin typing your search above and press return to search.

30వ ఏట పెళ్లి అప్పుడే ఫిక్సైన బ్యూటీ!

ఆ కొంద‌రిలో నేను ఉన్నానంటోంది మ‌ల‌యాళ బ్యూటీ పుణ్య ఎల‌జ‌బెత్. అమ్మ‌డు టోబీ కొయిప‌ల్లి అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది.

By:  Tupaki Desk   |   18 July 2024 1:50 PM GMT
30వ ఏట పెళ్లి అప్పుడే ఫిక్సైన బ్యూటీ!
X

పెళ్లిరోజు-పుట్టిన రోజును ఒకేరోజు సెల‌బ్రేట్ చేసుకోవ‌డం అన్న‌ది రేర్. అలా అంద‌రికీ క‌లిసి రాదు. ఆ కొంద‌రిలో నేను ఉన్నానంటోంది మ‌ల‌యాళ బ్యూటీ పుణ్య ఎల‌జ‌బెత్. అమ్మ‌డు టోబీ కొయిప‌ల్లి అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానుల‌తో పంచుకుంది. ' నాకు 30 ఏళ్లు వ‌చ్చే స‌రికి పెళ్లి చేసుకోవాల‌నుకున్నాను. ఇలా పెళ్లి చేసుకోవాల‌ని 15వ ఏట నిర్ణ‌యం తీసుకున్నాను.

అనుకున్న ప్ర‌కారం జ‌రుగుతుందా? లేదా? అన్న సందేహం ఉండేది. కానీ ఈ విష‌యం నా వాడు బాగా గుర్తు పెట్టుకుని గ‌త వార‌మే పెళ్లి ముహూర్తం పెట్టుకుని వ‌చ్చాడు. అలా ఇద్ద‌రం వివాహ బంధంలోకి అడుగు పెట్టాం. ఈరోజు నా పుట్టిన రోజు కూడా. అలా పెళ్లి వేడుక‌లు.. పుట్టిన రోజు వేడుక‌లు ఒకే రోజు జ‌రుపుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంది' అని అంది. అలాగే ఈ పెళ్లిలో ఫ్యామిలీ అంతా స‌ర‌దాగా క‌లిసి డాన్సులు చేసారు.

అంత‌కు ముందు కొంత ప్రాక్టీస్ కూడా చేసారు. ఆ మొత్తం వీడియోలు నెట్టింట షేర్ చేసింది. కుటుంబ స‌భ్యులు ఈ జంట‌కు అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు. పుణ్య ఎల‌జ‌బెత్ 2018లో కెరీర్ ప్రారంభిం చింది. 'తోబ‌మ' అనేది తొలి సినిమా. ఆ గుర్తింపుతో కోలీవుడ్ లోనూ అవ‌కాశాలు అందుకుంది. త‌మిళ లో ఐదారు సినిమాలు చేసింది. అమ్మ‌డిప్పుడు టాలీవుడ్ లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది.

మ‌రి వివాహం అయిన నేప‌థ్యంలో సినిమాలు కొనసాగిస్తుందా? లేదా? అన్న సందేహం ఉంది. సాధార‌ణంగా మాలీవుడ్ భామ‌లంతా పెళ్లి త‌ర్వాత కెరీర్ కొన‌సాగిండ‌చం అన్న‌ది పెద్ద‌గా జ‌ర‌గ‌దు. బాగా ఫేమ‌స్ అయిన న‌టీమ‌ణులు త‌ప్ప కొత్త వారు కొన‌సాగ‌డం క‌నిపించ‌దు. మ‌రి పుణ్య ఎల‌జ‌బెత్ సెకెండ్ ఇన్నింగ్స్ ని ఎలా ప్తాన్ చేస్తుందో తెలియాలి.