టాలీవుడ్..కోలీవుడ్ కి మాలీవుడ్ టెన్షన్!
సీనియర్ స్టార్లు మమ్ముట్టి...మోహన్ లాల్ లాంటి వారు చేస్తోన్న డిఫరెంట్ అటెంప్టస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
By: Tupaki Desk | 7 April 2024 11:01 AM GMTగడిచిన మూడేళ్ల కాలంలో మాలీవుడ్ సక్సెస్ రేట్ బాగా పెరిగింది. పరిమిత బడ్జెట్ లో రూపొందుతున్న సినిమాలు పాన్ ఇండియాలో సక్సెస్ అవుతున్నాయి. విజయాలతో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒంటిచేత్తో ఇండస్ట్రీని పైకి లేపుతున్నాడు. ఈ రెండేళ్ల కాలంలో ఆయన చేసిన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఆయనకు తోడుగా టోవినో థామస్...దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్లు బూస్టింగ్ లా నిలుస్తున్నారు. సీనియర్ స్టార్లు మమ్ముట్టి...మోహన్ లాల్ లాంటి వారు చేస్తోన్న డిఫరెంట్ అటెంప్టస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
సాధారణంగా అక్కడ సినిమాలు 50 కోట్లు వసూళ్లు సాధిస్తేనే గగనంగా కనిపించేది. కానీ ఇప్పుడ అక్కడా 100 కోట్లు మార్క్ అనేది సునాయాసం అయిపోయింది. పాన్ ఇండియాలో ఆ సినిమాలకు మంచి ఆదరణ దక్కడంతో కంటెంట్ విషయంలో అంతకంతకు నాణ్యత పెరుగుతుంది. డిజిటల్ మాధ్యమాల్లో మలయాళ చిత్రాలకు మునుపటి కంటే డిమాండ్ పెరిగింది. వీటన్నింటికంటే ముందు ఓ మాలీవుడ్ సినిమా టాలీవుడ్ కి వచ్చిందంటే? ప్రచారం ఠారెత్తిపోతుంది. వీరలెవల్లో ఆ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది.
ఆ సినిమాలో విషయం ఉందా? లేదా? అన్నది తర్వాత సంగతి జనాల్లోకి బలంగా తీసుకెళ్లే విషయంలో మంచి విజయం సాధిస్తున్నారు. ప్రధానంగా ఈ కారణంతోనే మలయాళం సినిమాకి పాన్ ఇండియాలో గుర్తింపు దక్కుతుం ది. ఇలా తెలుగు..తమిళ సినిమాలు మాత్రం వెళ్లడం లేదు. అగ్ర హీరోల సినిమాలు తప్ప మిగతా ఏ హీరో చిత్రం పాన్ ఇండియా సంచలనం అవ్వడం లేదు. మాలీవుడ్ కంటెంట్ లో ఉన్నంత విషయం టాలీవుడ్..కోలీవుడ్ చిత్రాల్లో ఉండటం లేదన్న విమర్శ తాజాగా తెరపైకి వస్తోంది.
పాన్ ఇండియాలో సరైన నాలుగైదు మలయాళ సినిమాలు సక్సెస్ అయితే టాలీవుడ్..కోలీవుడ్ కి గట్టి పోటీ ఎదురైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కి పోటీగా కోలీవుడ్ కంటెంట్ దిగుతోన్న సంగతి తెలిసిందే.