Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ ఆవేశం.. రీమేకా లేదా డబ్బింగా..?

మలయాళ విలక్షణ నటులలో ఒకరైన ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ను చేరుకుంది.

By:  Tupaki Desk   |   25 April 2024 3:44 AM GMT
సూపర్ హిట్ ఆవేశం.. రీమేకా లేదా డబ్బింగా..?
X

ఈ ఇయర్ మలయాళ పరిశ్రమ వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తుంది. ఇప్పటికే స్టార్ హీరో మమ్ముట్టి భ్రనయుగం హిట్ కాగా మరో స్టార్ పృధ్విరాజ్ నటించిన గోట్ లైఫ్ ఆడు జీవితం సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక యువ నటులు చేసిన మంజుమ్మల్ బోయ్స్, యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేమలుతో కూడా మరో రెండు సూపర్ హిట్లు అందుకున్న ఆ పరిశ్రమ రీసెంట్ గా రిలీజైన ఆవేశంతో మరో సెన్సేషనల్ హిట్ అందుకుంది.

మలయాళ విలక్షణ నటులలో ఒకరైన ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ను చేరుకుంది. ఆవేశం టైటిల్ పెట్టి ఫాహద్ ఫాజిల్ చేసిన వన్ మ్యాన్ షోకి ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. సినిమా కథ అంత గొప్పగా లేకపోయినా ఫాఫా షో ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలో ఒక డాన్ గా ఫాహద్ ఫాజిల్ చేసిన యాక్టింగ్, కామెడీ సినిమాను ఈ రేంజ్ హిట్ అందుకునేలా చేసింది.

ఇక మలయాళంలో హిట్ అనే టాక్ రాగానే ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకోవడమో లేదా డబ్బింగ్ చేయడమో చేస్తుంటారు మన తెలుగు మేకర్స్. భ్రమ యుగం, ఆడు జీవితం, మంజుమ్మల్ బోయ్స్, ప్రేమలు ఈ నాలుగు సినిమాలు తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. ప్రేమలు, మంజుమ్మల్ బోయ్స్ సినిమాలు తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. తెలుగులో వచ్చిన టాక్ చూసే ప్రేమలు సీక్వెల్ గా ప్రేమలు 2 అనౌన్స్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే మలయాళంలో ప్రెజంట్ హిట్ ఆవేశం సినిమాను తెలుగు ఆడియన్స్ ముందుకు ఎలా తెస్తారన్నది డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఆవేశం ఒకవేళ రీమేక్ చేస్తారా లేదా ఎలాగు ఫాహద్ ఫాజిల్ తెలుగు ఆడియన్స్ కు పరిచయమే కాబట్టి డబ్ చేసి రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఫాహద్ ఫాజిల్ వర్సటాలిటీ చూపించేలా ఆవేశం సినిమా ఉందని చెప్పొచ్చు. తప్పకుండా ఈ సినిమా డబ్బింగ్ అయినా తెలుగు ఆడియన్స్ సినిమాను ఆదరించే ఛాన్స్ ఉంటుంది. ఫాహద్ ఫాజిల్ ఆవేశం మలయాళంలో 100 కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తుండగా తెలుగు లో కూడా రిలీజైతే ఇక్కడ ఆడియన్స్ కూడా ఆ సినిమాను ఆదరించే ఛాన్స్ ఉంది. మరి మన మేకర్స్ ఆవేశం ని ఎలా తీసుకొస్తారన్నది చూడాలి.