Begin typing your search above and press return to search.

ఆ రెండైనా తెలుగు ప్రేక్షకులకు ఎక్కేనా..?

ఇన్ని రోజులు హనుమాన్ ఆడడానికి కారణం ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా గొప్పగా లేక పోవడం

By:  Tupaki Desk   |   3 March 2024 3:30 PM GMT
ఆ రెండైనా తెలుగు ప్రేక్షకులకు ఎక్కేనా..?
X

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సంక్రాంతి సినిమాల్లో కొన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. సంక్రాంతికే వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే హనుమాన్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా సాధించని 50 రోజుల థియేటర్ల సంఖ్యను హనుమాన్ సాధించింది.

ఇన్ని రోజులు హనుమాన్ ఆడడానికి కారణం ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా గొప్పగా లేక పోవడం. ప్రతిష్టాత్మకంగా రూపొంది విడుదల అయిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు వెళ్లాలి అంటే పెద్ద సినిమా కానీ, మంచి సినిమా కానీ లేకుండా పోయింది.

ఇలాంటి సమయంలో రాబోతున్న రెండు డబ్బింగ్‌ సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వచ్చే వారంలో మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ప్రేమలు విడుదల అవ్వబోతుంది. హైదరాబాద్‌ బ్యాక్ గ్రౌండ్‌ గా రూపొందిన ఆ మలయాళ సినిమాను అదే టైటిల్ తో డబ్‌ చేసి విడుదల చేయబోతున్నారు.

ఆ సినిమా కచ్చితంగా తెలుగు యువతకి ఎక్కుతుందని నిర్మాతలు అంటున్నారు. ఇక ఆ తర్వాత వారం మంజుమ్మెల్‌ బాయ్స్ విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా కూడా యూత్‌ కి కనెక్ట్‌ అయ్యే సినిమా. ప్రేమలు మరియు మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమాలు మలయాళ బాక్సాఫీస్‌ ను షేక్ చేశాయి.

ప్రస్తుతం తెలుగు సినిమాలతో బాక్సాఫీస్ కలకలలాడటం లేదు. ఇలాంటి సమయంలో ఆ రెండు మలయాళ సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి.. నచ్చి బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయా అనేది చూడాలి.