Begin typing your search above and press return to search.

హీరోయిన్ న‌డుముపై చ‌పాతీలు వేడి చేయిస్తాన‌న్న సౌత్ డైరెక్ట‌ర్!

ప్రస్తుతం బాలీవుడ్‌లో తాజా విడుదల `విక్కీ విద్యా కా వో వాలా` వీడియోలో తన పాత్రతో మ‌ల్లిక‌ వార్తల్లో నిలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:26 AM GMT
హీరోయిన్ న‌డుముపై చ‌పాతీలు వేడి చేయిస్తాన‌న్న సౌత్ డైరెక్ట‌ర్!
X

గ‌త కొద్ది రోజులుగా వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోంది మ‌ల్లికా షెరావ‌త్. బాలీవుడ్ అంత‌ర్గ‌త విష‌యాలు స‌హా సౌత్ లో త‌న‌కు ఎదురైన అనుభ‌వాల గురించి పూస‌గుచ్చి నేష‌న‌ల్ మీడియాకు చెబుతుంటే అవ‌న్నీ సంచ‌ల‌నాలుగా మారుతున్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్‌లో తాజా విడుదల `విక్కీ విద్యా కా వో వాలా` వీడియోలో తన పాత్రతో మ‌ల్లిక‌ వార్తల్లో నిలుస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మల్లిక చాలా మీడియా సంస్థలతో మాట్లాడుతోంది. ఎప్పటిలాగే మ‌ల్లిక బోల్డ్ గా రిఫ్రెషింగ్‌గా కొత్త విష‌యాల‌ను మాట్లాడుతోంది. హాట‌ర్‌ఫ్లై తో మాట్లాడిన‌ మల్లిక మ‌నుషుల వ‌క్ర దృష్టి, చెడు క‌న్ను గురించి కూడా చ‌ర్చించింది. మ‌ర్డ‌ర్ సినిమాలో బోల్డ్ పాత్ర‌లో న‌టించినందుకు త‌న‌ను ప్ర‌జ‌లు ఎలా చూసేవారో వెల్ల‌డించింది. తాను బ‌య‌ట కూడా అలా ఉంటాన‌ని భావించార‌ని, కానీ ఫిలింమేక‌ర్స్ అలాంటి దృష్టితో చూసిన‌ప్పుడు అవ‌కాశాల్ని తిర‌స్క‌రించాన‌ని కూడా మ‌ల్లిక వెల్ల‌డించారు.

అదే స‌మ‌యంలో ఒక సౌత్ ద‌ర్శ‌కుడితో త‌న అనుభ‌వం గురించి ఓపెనైంది. సౌత్‌లో ఓ పాట చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన సంఘటనను ప్రస్తావించింది మల్లిక. ``ఒక సౌత్ డైరెక్టర్ తన సినిమాలో హా* ఐటెం సాంగ్ ఉందని దానిలో న‌ర్తించాల‌ని అడిగారు. ఈ పాట ఎలా ఉండాలి? అంటేచూసే ప్రేక్షకులకు మీరెంత హా* అనేది అర్థమవ్వాలని అన్నాడు. దానికి ఓకే చెప్పాక‌... తెర‌పై నన్ను ఎలా చూపిస్తున్నారు? అని నేను ప్ర‌శ్నించాను. ``మీ నడుముపై చపాతీలు వేడి వేడిగా వేయిస్తాను`` అని చెప్పాడు. ఆ కొంటె జ‌వాబుకి నేను షాక్ తిన్నాను. నేను ఈ ఐట‌మ్ పాట‌లో చేయను అని చెప్పేశాను! అని మల్లిక వెల్ల‌డించింది. అయితే మ‌ల్లిక ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అన్న‌ది చెప్ప‌క‌పోవ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఆరాలు తీసే పనిలో ఉన్నారు. ఇంత‌కీ మ‌ల్లిక‌ను అలా అడిగిన డైరెక్ట‌ర్ ఎవ‌రై ఉంటారు?