Begin typing your search above and press return to search.

చాలా మంది పతితులు... వారిని ప‌ట్టించుకోకు..!

ముఖ్యంగా త‌న‌ బాలీవుడ్ కొలీగ్స్ నుంచి తీవ్ర అవ‌మానాల‌ను ఎదుర్కొన్నాన‌ని గుర్తు చేసుకుంది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 12:30 PM GMT
చాలా మంది పతితులు... వారిని ప‌ట్టించుకోకు..!
X

2004 ఎరోటిక్ థ్రిల్లర్ 'మర్డర్' విజయం తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మల్లికా షెరావత్ ఇటీవలి ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి ఓపెనైంది. రణ్‌వీర్ అల్లాబాడియా పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. మ‌ర్డ‌ర్ చిత్రం తనకు స్టార్‌డమ్ ని ఇవ్వ‌డమే కాదు.. క‌ష్టాల‌ను కొని తెచ్చింద‌ని తెలిపింది. తాను చాలా కాలంగా కోరుకున్న ఆర్థిక స్వాతంత్రాన్ని పొంద‌గలిగినా కానీ, త‌న‌కు పెను స‌వాళ్లు ఎదుర‌య్యాయ‌ని మ‌ల్లిక అంది. ముఖ్యంగా త‌న‌ బాలీవుడ్ కొలీగ్స్ నుంచి తీవ్ర అవ‌మానాల‌ను ఎదుర్కొన్నాన‌ని గుర్తు చేసుకుంది.

మ‌ర్డ‌ర్ నాకు స్టార్‌డమ్ ఇచ్చింది.. ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది.. కానీ స‌మ‌స్య‌ల్ని తెచ్చింది! అని మల్లిక వెల్లడించింది. నాకు అవార్డులు గెలవడం ఎప్పుడూ లక్ష్యం కాదు. ముఖ్యంగా ఏదైనా స‌రైన‌దా లేక త‌ప్పుగా ఆలోచిస్తున్నానా అనేదానితో సంబంధం లేకుండా నా స్వీయ‌ నిబంధనలపై జీవితాన్ని గడపడం, నిర్ణయాలు తీసుకోవడం అల‌వాటు. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు కేవలం అద‌న‌పు భాగ్యం మాత్రమేన‌ని అభిప్రాయ‌ప‌డింది. మ‌ర్డ‌ర్ అన్నింటినీ మార్చేసింది. నా విషయంలో ప్ర‌జ‌ల ప్ర‌వ‌ర్త‌న కూడా వింత‌గా మారింది. అకస్మాత్తుగా అందరూ నన్ను గుర్తించారు. నాపై వారి వైఖరి మారిపోయింది. అప్పటికి ఆ పేరు చాలా పెద్దది.. అని గుర్తు చేసుకుంది. 2000ల ప్రారంభంలో న‌టిగా నాకంటూ ఒక స్పేస్ ని రూపొందించుకున్నాను. కానీ నేటి త‌రం ఔత్సాహిక నటీమ‌ణులు పూర్తిగా భిన్నమైన నిజాల‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, కంటెంట్ కార‌ణంగా మాత్ర‌మే రెండు వారాలు ఆడుతుంది.

2004 నాటికి భార‌తీయ‌ సంస్కృతి తనలాంటి నటి కోసం సిద్ధంగా లేద‌ని కూడా మల్లిక అంగీకరించింది. అప్ప‌టి సంస్కృతి నా కోసం సిద్ధంగా లేదు.. అలాగ‌ని హత్యకు కూడా సిద్ధంగా లేదు. 2004లో నేను ఉన్న స్థితికి ఇప్పుడు బాలీవుడ్‌ చేరుకుంది! అని మ‌ల్లిక‌ అన్నారు. ఆ సమయంలో నటీమణులు ఒక నిర్దిష్ట ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని భావించారు. వారు సిగ్గుపడేవారు.. నేను అందుకు భిన్నంగా ఉన్నాను. దేనినీ మన్నించకుండా ఉన్నాను. మర్డర్‌తో ఒక ఫెమ్మె ఫాటేల్ పరిచయం చేసాను.. అని తెలిపింది.

మ‌ర్డ‌ర్ లో వివాహేత‌ర సంబంధం న‌డిపే పెళ్ల‌యిన యువ‌తిగా న‌టించాక‌.. తన తోటివారి నుంచి తాను ఎదుర్కొన్న కఠినమైన జ‌స్టిస్ గురించి కూడా మల్లిక తెలిపింది. బాలీవుడ్‌లో కొంతమంది పెద్ద పేరున్న‌ నటీమణులు (పేర్లు చెప్ప‌ను) త‌న‌ను అవ‌మానించార‌ని, అది త‌ట్టుకోలేక ఏడ్చేశాన‌ని తెలిపింది. ఓదార్పు కోసం తన గురువు మహేష్ భట్‌ను ఆశ్రయించాన‌ని మ‌ల్లిక తెలిపింది. ''నేను ఏడుస్తూ అతడి వద్దకు పరిగెత్తాను.. అతడు నాకు ఏం చెప్పారంటే... బాలీవుడ్‌లో చాలా మంది పతితులు... వారిని ప‌ట్టించుకోకు..!'' అన్నారు. నాకు జ‌రిగిన‌ది ఇదే. చాలా మంది పతిత‌ల వ‌ల్ల‌ అవమానం జరిగింది. నేను చేసిన బోల్డ్ సీన్స్ చూసి సిగ్గుపడేలా చేయాలనుకున్నారు! అని మ‌ల్లిక వెల్ల‌డించింది.

మర్డర్ ప్రేక్షకులకు ఎందుకు క‌నెక్ట‌యిందో, ముఖ్యంగా మహిళలకు కూడా ఎందుకు న‌చ్చిందో మ‌ల్లిక మాట్లాడింది. కేవలం స్కిన్ షో వల్ల సినిమా పెద్ద హిట్ అవ్వదు. స్త్రీలు కథతో కనెక్ట్ అయ్యారు.. ముఖ్యంగా వివాహిత మహిళ ఒంటరితనం అంద‌రికీ క‌నెక్ట‌యింది. అందుకే మర్డర్ ఇప్పటికీ శాశ్వతమైన క్లాసిక్.. అని విశ్లేషించింది.