తల్లిదండ్రులపై మల్లికాషెరావత్ సంచలన ఆరోపణలు!
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన తల్లిదండ్రులపై సంచలన ఆరోపణలు చేసింది.
By: Tupaki Desk | 12 Oct 2024 3:30 PM GMTబాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన తల్లిదండ్రులపై సంచలన ఆరోపణలు చేసింది. తనని చిన్నప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదని వ్యాఖ్యానించింది. `కూతురు కంటే కొడుకునే గారాబం చేసేవారు. నాపై మాత్రం వివక్ష చూపించేవారు. అప్పట్లో అలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్దమయ్యేది కాదు. కొడుకును బాగా చదివించాలి. విదేశాలకు పంపించాలి. అతడి కోసం ఎంతైనా ఖర్చు చేయాలని వాళ్ల ఆలోచనలు ఉండేవి.
కుటుంబ ఆస్తి అంతా కుమారుడికే చెందాలి. ఆ తర్వాత వాళ్ల కుమారుడికే చెందాలి అనే వైఖరితో ఉండేవారు. మరి అమ్మాయిలు ఏం పాపం చేసారు? వాళ్లకి పెళ్లి చేసి భారం తగ్గించుకుంటే సరిపోతుందనుకున్నారా? తల్లిదండ్రుల మాటలు, ప్రవర్తన నన్నోంతో బాధించేవి. ఇలాంటి పరిస్థితి నేను ఒక్కరే చూడలేదు. గ్రామంలో ఉండే చాలా మంది ఆడపిల్లల పరిస్థితి ఇలాగే ఉంటుంది. నాపేరెంట్స్ అన్ని ఇచ్చారు ఒక్క స్వేచ్ఛ తప్పా.
వాళ్లకు తెలియకుండా ఆటలు ఆడేదాన్ని. ఎందుకంటే నీకు కండలు వస్తున్నాయి. అలా వస్తే మగాడు అనుకుంటారు. పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు అని గొడవ పడేవారు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కన్నా. నేను పుట్టినప్పుడు నా పేరెంట్స్ విచారం వ్యక్తం చేసారు. మా అమ్మ అయితే కచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటుంది` అని అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తల్లిదండ్రులపై మల్లికా షెరావత్ ఇంతవరకూ ఎక్కడా ఇలా స్పందించలేదు.
చాలా కాలంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఎన్నో సినిమా ప్రచారాల్లో పాల్గొంది. కానీ ఏనాడు తల్లిదండ్రులను ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు. 47 ఏళ్ల మల్లికా షెరావత్ హర్యానకు చెందిన నటి. 1997 లో కరణ్ సింగ్ గిల్ ని వివాహం చేసుకుంది. కానీ కొంతకాలమే కలిసి ఉన్నారు. తర్వాత విడాకులతో వేరయ్యారు. ఆ తర్వాత మళ్లి పెళ్లి చేసుకోలేదు.