Begin typing your search above and press return to search.

VD vs హీరోయిన్.. మ్యాటర్ ఏమిటంటే..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో చేసి డిజాస్టర్ అందుకున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2024 10:30 AM GMT
VD vs హీరోయిన్.. మ్యాటర్ ఏమిటంటే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో చేసి డిజాస్టర్ అందుకున్నారు. తరువాత అతని నుంచి వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు హిందీలో రిలీజ్ అయిన నార్త్ లో విజయ్ పెద్దగా ప్రమోట్ చేయలేదు. నార్త్ ఇండియాలో అతనికి స్టార్ ఇమేజ్ ఉంది. ఇక హిందీ సినిమాలపై విజయ్ ఫోకస్ చేయకపోవడంపై నటి మలోబిక బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఓ విధంగా చెప్పాలంటే రౌడీ స్టార్ అభిమానులకి ఆమె కామెంట్స్ కోపం తెప్పించాయని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండతో మలోబిక గతంలో ఒక ప్రైవేట్ సాంగ్ లో నటించింది. నీ వెనకాలే నడిచి అనే సాంగ్ లో జతకట్టింది. ఈ బ్యూటీ బెంగాలీ, ఒడిస్సా బాషలలో హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో మలోబిక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ హిందీ భాషపై విజయ్ కి అంత ఆసక్తి ఉండదని కామెంట్స్ చేసింది.

అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వేరేవిధంగా వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండకి హిందీ భాష అంటే నచ్చదని, దానిని అసహించుకుంటాడు అని మలోబిక చెప్పినట్లు టాక్ నడిచింది. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చింది. తాను విజయ్ దేవరకొండ మీద చేసిన కామెంట్స్ ఒకటైతే అవి జనాల్లోకి మరోలా వెళ్లాయని మలోబిక చెప్పుకొచ్చింది.

ఏది ఏమైనా నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పింది. అందుకే విజయ్ దేవరకొండకి క్షమాపణలు చెబుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్ చదివాక విజయ్ నాకు టచ్ లో లేడని మలోబిక తెలిపింది. నా మాటలు విజయ్ ని నొప్పించి ఉంటే అతన్ని మనస్పూర్తిగా క్షమించమని కోరుతున్నట్లు మలోబిక తెలియజేసింది. విజయ్ తనని క్షమిస్తాడని నమ్మకం ఉందని పేర్కొంది.

మలోబిక బెనర్జీ బెంగాలీ సినిమాలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. విజయ్ దేవరకొండతో సాంగ్ చేసిన తర్వాత తెలుగులో హీరోయిన్ గా ఆఫర్స్ వస్తాయని మలోబిక భావించింది. అయితే ఆమె విజయ్ చేసిన కామెంట్స్ కారణంగా పెద్దగా ఛాన్స్ లు అందుకోలేకపోయిందనే టాక్ ఉంది. మరి ఆమెకు టాలీవుడ్ నుంచి భవిష్యత్తులో ఏమైనా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.