మీరు వర్జినా? అనేసరికి హీరోయిన్ ఏం చెప్పిందంటే..
అయితే పెళ్లి ప్రస్తావన వద్దనుకుంటే, మరో నెటిజన్ అడిగిన ప్రశ్న మరింత దారుణం. "మీరు వర్జినా?" అంటూ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నను చూసి మాళవిక అసహనానికి గురైంది.
By: Tupaki Desk | 13 March 2025 12:05 AM ISTసోషల్ మీడియా ఇప్పుడు సెలబ్రిటీలకు ఓ వేదికే కాదు, పలు సందర్భాల్లో వారికి ఇబ్బందికరమైన అనుభవాలకూ కారణమవుతోంది. సినిమాల్లో ఎంత బోల్డ్‌గా కనిపించినా, వ్యక్తిగతంగా కొన్ని హద్దులు ఉండాలని భావించే హీరోయిన్లకు నెటిజన్లు కొన్ని ప్రశ్నలు అడిగితే మాత్రం సహనం కోల్పోతారు. తాజాగా తమిళం నుంచి బాలీవుడ్ వరకూ తన అందంతో, నటనతో ఆకట్టుకుంటున్న మాళవిక మోహనన్ ఈ విషయంలో నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
తన సినిమాల విషయాన్ని పక్కనపెడితే, మాళవిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాలోవర్స్‌తో రెగ్యులర్‌గా ఇంటరాక్ట్ అవుతూ, వారికి సమాధానాలు ఇస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఆమెకు వచ్చిన కొన్ని ప్రశ్నలు ఊహించనివి. ఎప్పటిలాగే ఓ ట్విట్టర్ సెషన్‌లో ఫ్యాన్స్ కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగితే, మరికొంతమంది మాత్రం హద్దులు మీరేలా ప్రశ్నలు సంధించారు. ఇందులో ఓ నెటిజన్ తనను పెళ్లి చేసుకోవాలంటూ అడిగితే, మాళవిక అసహనం వ్యక్తం చేసింది.
అయితే పెళ్లి ప్రస్తావన వద్దనుకుంటే, మరో నెటిజన్ అడిగిన ప్రశ్న మరింత దారుణం. "మీరు వర్జినా?" అంటూ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నను చూసి మాళవిక అసహనానికి గురైంది. ఇలాంటి అసభ్యకరమైన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. "ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం మానేయండి" అంటూ తిప్పికొట్టింది. దీనితో ఆ నెటిజన్ తన పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేసేసినా, అప్పటికే స్క్రీన్‌షాట్లు వైరల్ కావడం గమనార్హం.
ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు అడిగే నెటిజన్ల గురించి మాళవిక తన బాధను వ్యక్తం చేసింది. గతంలోనూ పలు హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా, చాలా మంది కనీసం స్పందించలేదు. కానీ మాళవిక మాత్రం నేరుగా సమాధానం ఇవ్వడమే కాదు, నెటిజన్ల ప్రవర్తనను కూడా ప్రశ్నించడం ప్రత్యేకం. ప్రస్తుతం మాళవిక ప్రభాస్ సరసన 'ద రాజా సాబ్'లో నటిస్తోంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మాళవికకు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా ఉండబోతోందని టాక్.
ఇదే సమయంలో బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉంది. కెరీర్ పరంగా ఇలా ఎదుగుతూ, సోషల్ మీడియాలో కూడా తనదైన స్ట్రాంగ్ స్టాండ్‌తో నిలబడుతున్న మాళవిక నెటిజన్లకు మంచి లెస్సన్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు ఎక్కువగా మౌనం పాటిస్తారు కానీ, మాళవిక మాత్రం స్ట్రైట్‌గా స్పందించి ట్రోల్లింగ్‌ను ఎదుర్కోవడం ఆమె ధైర్యానికి నిదర్శనం. ఈ ఘటనతో ఇకపై ఎవరైనా ఆమెకు ఇలాంటి అసభ్యమైన ప్రశ్నలు అడగాలంటే కాస్త ఆలోచించాల్సిందే.