Begin typing your search above and press return to search.

మాళవిక గ్లామర్ బ్లాస్ట్ ఎవరైనా పోటీ ఇవ్వగలరా?

అయితే ఈ జెనరేషన్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ గ్లామర్ ప్రపంచంలోకి వస్తూ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 1:03 PM GMT
మాళవిక గ్లామర్ బ్లాస్ట్  ఎవరైనా పోటీ ఇవ్వగలరా?
X

నార్త్ ఇండియన్ ముద్దుగుమ్మలు గ్లామర్ షో విషయంలో కాస్తా స్పీడ్ గా ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. అందుకే వారికి హీరోయిన్స్ గా ఆఫర్స్ ఎక్కువ వస్తుంటాయి. అందంతో పాటు నటనలో కూడా ఆకట్టుకునే బ్యూటీస్ స్టార్ హీరోయిన్స్ గా మారుతారు. సౌత్ లో స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అయిన నార్త్ ఇండియన్ భామలని చూసుకుంటే కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి టాప్ లిస్ట్ ఎక్కువగానే ఉంది.


అయితే ఈ జెనరేషన్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ గ్లామర్ ప్రపంచంలోకి వస్తూ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో ఎవరు ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్స్ గా కొనసాగలేకపోతున్నారు. కొంతమంది బ్యూటీస్ అందం, అభినయంతో ఆకట్టుకున్న సరైన సక్సెస్ లు సాధించలేక కెరియర్ లో వెనుకబడిపోతారు. బ్యాడ్ లక్ బ్యూటీస్ గా మిగిలిపోతారు. అలాంటివారిలో మాళవిక శర్మ కనిపిస్తుంది. నేల టిక్కెట్టు సినిమాతో హీరోయిన్ గా మాళవిక శర్మ కెరియర్ స్టార్ట్ చేసింది.

తరువాత రామ్ కి జోడీగా రెడ్ మూవీలో నటించింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కాఫీ విత్ కాదల్ సినిమాతో మాళవిక అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ ఏడాది తెలుగులో భీమా, హరోం హర సినిమాలతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాలు రెండు డిజాస్టర్ అయ్యాయి. భీమాలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకపోయిన గ్లామర్ క్వీన్ గా ఆకట్టుకుంది. హరోంహర సినిమాలో కాస్తా నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించింది.

అయితే ఈ రెండు సినిమాలు ఆమెకి అదృష్టం తీసుకురాలేదు. గ్లామర్ షో విషయంలో మాళవిక శర్మ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. కానీ బ్రేక్ ఇచ్చే సినిమా పడటం లేదు. ఈ బ్యూటీ ఓ వైపు నటిగా కెరియర్ కొనసాగిస్తూనే లాయర్ గా కూడా ప్రాక్టీస్ మొదలెట్టింది. ఇన్ స్టాగ్రామ్ లో మాళవిక శర్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తమ గ్లామర్ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు జీన్ ప్యాంట్ వేసుకొని పైన షర్టు బటన్స్ తీసేసి అదిరిపోయే అందాలతో ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలో ఆమె అందాన్ని చూస్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ దర్శకులు మాళవిక శర్మ గ్లామర్ ని కరెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం లేదని మరికొందరు అంటున్నారు. ఒక్క సక్సెస్ తో మాళవిక శర్మకి బ్రేక్ వస్తే ఆమెని ఇంకెవరు ఆపలేరని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.