Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సాదా చీర‌లో మాళ‌విక సింగారం

చిలుకాకు ప‌చ్చ (నియాన్ గ్రీన్) సాదా చీర‌లో సింపుల్ గా క‌నిపిస్తున్న మాళ‌విక బ్యాక్ లెస్ లుక్ లో ఆక‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 5:45 AM GMT
ఫోటో స్టోరి: సాదా చీర‌లో మాళ‌విక సింగారం
X

అందాల క‌థానాయిక‌ మాళవిక మోహనన్ తనదైన‌ అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. క‌వ్వించే లుక్స్.. మంత్రముగ్దులను చేసే వ్యక్తిత్వంతో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించిన ఈ బ్యూటీ ఫ్యాష‌న్ గేమ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నాన్ని ఆవిష్క‌రిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. మాళ‌విక తాజాగా చీర‌లో సింగారం ఒల‌క‌బోసిన ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. చిలుకాకు ప‌చ్చ (నియాన్ గ్రీన్) సాదా చీర‌లో సింపుల్ గా క‌నిపిస్తున్న మాళ‌విక బ్యాక్ లెస్ లుక్ లో ఆక‌ట్టుకుంది.


మాళవిక ప్రస్తుతం తంగళన్ అనే చిత్రంలో న‌టిస్తోంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 26 జనవరి 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విక్రమ్, పార్వతి తిరువోతు, పశుపతి త‌దితరులు నటించారు. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. స్టూడియో గ్రీన్- నీలం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. మాళవిక తంగలన్‌లో డీగ్లామ‌ర‌స్ప పాత్ర‌లో న‌టించ‌డాన్ని ఆస్వాధిస్తున్నాన‌ని తెలిపింది. ఈ సినిమా గురించి ఓ అభిమానితో సామాజిక మాధ్య‌మాల్లో మాట్లాడుతూ మాళ‌విక‌ స్పందించింది.


మాళవిక మాట్లాడుతూ `తంగలన్` విడుదలపై మేమంతా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నామని, ఆస‌క్తిగా వేచి చూస్తున్నామ‌ని తెలిపింది. గత అక్టోబర్‌లో తంగ‌ల‌న్ చిత్రీకరణ ప్రారంభ‌మైంది. ప్రపంచం మొత్తం ఈ చిత్రాన్ని చూడాలని ఆకాంక్షించారు. మాళవిక చివరిగా ఆల్విన్ హెన్రీ దర్శకత్వం వహించిన క్రిస్టీ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులు విమ‌ర్శ‌కుల‌ నుండి పేలవమైన సమీక్షలను అందుకుంది.


తంగ‌ల‌న్ కి కేజీఎఫ్ లింక్:

తంగ‌ల‌న్ క‌థాంశంపై నిర్మాత జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో ముచ్చ‌టించారు. విక్రమ్ పాత్రను తంగలన్ అని పిలుస్తారని, దానినే టైటిల్ పెట్టామ‌ని వెల్లడించారు. స్వాతంత్య్రానికి పూర్వం జ‌రిగిన నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో విక్రమ్ స‌హా ఇత‌ర‌ పాత్రలు రగ్డ్ లుక్‌తో క‌నిపిస్తాయి. కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. బ్రిటీష్ పాలనలో KGF లో పనిచేసిన వ్యక్తుల చుట్టూ తిరిగే క‌థ ఇద‌ని ఇంత‌కుముందు పా రంజిత్ వెల్ల‌డించారు. ద‌ర్శకుడు పా రంజిత్ ఈ చిత్రానికి సంబంధించిన కథ, స్క్రిప్ట్‌పై దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వర్క్ చేసి ఫైనల్ చేశారు. ఈ చిత్రంలో విక్రమ్ ర‌గ్డ్ లుక్ కి ఇప్ప‌టికే గొప్ప స్పంద‌న వ‌చ్చింది. అత‌డు గుబురు గ‌డ్డం మాసిన జుత్తుతో ఒక సాధువులా కనిపిస్తున్నాడు. 2021లో సినిమా ప్రారంభం కాగా, అనంత‌రం పాత్ర‌ధారుల ప్రిప‌రేష‌న్ మొద‌లైంది. పీరియాడికల్ ఫిల్మ్ క‌థాంశంలో నాయిక‌కు అద్భుత‌మైన పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉంద‌ని తెలిసింది. పా రంజిత్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకుర్చారు. అలాగే ఈ చిత్రాన్ని 3డిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.