Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ తో నో రిలేషన్ : హీరోయిన్

రీసెంట్ గా రాజ్ తరుణ్ కు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని మళ్లీ లావణ్య ఆరోపించింది.

By:  Tupaki Desk   |   8 July 2024 3:30 PM GMT
రాజ్ తరుణ్ తో నో రిలేషన్ : హీరోయిన్
X

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనతో కొన్నేళ్లుగా సహజీవనం చేసి, ఇప్పుడు కొత్త హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి ఆమెకు దగ్గరయ్యారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ కు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని మళ్లీ లావణ్య ఆరోపించింది.

అయితే లావణ్యతో తనకు రిలేషన్ ఉన్న విషయం నిజమేనని రాజ్ తరుణ్ కూడా తెలిపారు. కానీ 2017 తర్వాత ఆమెతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అదే సమయంలో మాల్వీ మల్హోత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య చేస్తున్న ఆరోపణలను ఖండించింది. అనవసరమైన ఆరోపణలు చేస్తూ.. తనను, తన పేరెంట్స్ ను బెదిరిస్తోందని పేర్కొంది. అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది. తాజాగా మీడియాతో మాట్లాడింది.

రాజ్ తరుణ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని మాల్వీ మల్హోత్రా క్లారిటీ ఇచ్చింది. లావణ్య చెబుతున్న స్టోరీ అంతా నిజం కాదని తెలిపింది. "నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్స్. తిరగబడరా స్వామి లాస్ట్ షెడ్యూల్ జరుగుతున్న గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ టైమ్ లో లావణ్య నాకు కాల్ చేసింది. రాజ్ తరుణ్ తో మాట్లాడొద్దని చెప్పింది. దీంతో ఇదే విషయాన్ని రాజ్ తరుణ్ కు అడిగాను. వెంటనే ఆమెను బ్లాక్ చేయమని చెప్పారు. అప్పుడు లావణ్య హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న నా పేరెంట్స్ ను కాంటాక్ట్ అయింది" అని చెప్పింది.

"అసలు మా పేరెంట్స్ నంబర్స్ ఆమెకు ఎలా వచ్చాయి? నా ఫోన్ ను లావణ్య ట్రాక్ చేస్తోంది. రాజ్ తరుణ్ దగ్గర కూడా మా పేరెంట్స్ నంబర్స్ లేవు. మరెలా తెలిశాయి ఆమెకు? హిమాచల్ లో నా పేరెంట్స్ కు కాల్ చేసి తప్పుడు మాటలు ఆడింది. దీంతో రాజ్ తరుణ్ కు ఈ విషయం చెప్పాను. లిమిట్స్ క్రాస్ చేస్తుందని తెలిపాను. అప్పటి నుంచి రాజ్ తరుణ్, నేను మాట్లాడుకోవడం లేదు. కొన్ని నెలల పాటు మాట్లాడలేదు" అని తెలిపింది.

"మళ్లీ మార్చి నుంచి సినిమా ప్రమోషన్స్ కోసం మాట్లాడాం. మూవీ కోసం మాత్రమే మాట్లాడుతున్నా. దీంతో లావణ్య నన్ను, నా పేరెంట్స్ ను మళ్లీ టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. తప్పుడు భాష వాడుతోంది. నేనెప్పుడు ఆమెతో తప్పుగా మాట్లాడలేదు. అసలు ఆమెను నేనెప్పుడు కలవలేదు. మాకు ఎలాంటి రాజకీయ నాయకులతో సంబంధం లేదు. ఫాదర్ బిజినెస్ మ్యాన్, మదర్ గవర్నమెంట్ టీచర్. నాతోపాటు నా ఫ్యామిలీపై లావణ్య చేస్తున్న ఆరోపణలు నిజం కావు" అని స్పష్టం చేసింది మాల్వీ మల్హోత్రా.